Begin typing your search above and press return to search.

'మహర్షి' రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన దిల్‌ రాజు

By:  Tupaki Desk   |   22 Jan 2019 10:53 AM GMT
మహర్షి రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన దిల్‌ రాజు
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 25వ చిత్రం 'మహర్షి' విడుదల విషయంలో గత కొన్ని రోజులుగా కన్ఫ్యూజ్‌ సృష్టించేలా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఏప్రిల్‌ లో విడుదల కాబోతుందని ముందే ప్రకటించినా కూడా డేట్‌ విషయంలో క్లారిటీ లేదు. ఏప్రిల్‌ లో 'మజిలీ', 'కాంచన 3' ఇంకా జెర్సీ చిత్రం కూడా రాబోతున్న నేపథ్యంలో 'మహర్షి' చిత్రం విడుదల తేదీ విషయంలో చర్చ జరిగింది. రక రకాల డేట్లు మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దిల్‌ రాజు ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు.

దిల్‌ రాజు బ్యానర్‌ లో తాజాగా సంక్రాంతి కానుకగా వచ్చిన 'ఎఫ్‌ 2' సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా సక్సెస్‌ నేపథ్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దిల్‌ రాజు ప్రస్తుతం తాను నిర్మిస్తున్న మహేష్‌ బాబు 'మహర్షి' చిత్రం విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఏప్రిల్‌ 25న మహర్షి చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను దిల్‌ రాజుతో కలిసి అశ్వినీదత్‌ మరియు పీవీపీలు నిర్మిస్తున్నారు.

భరత్‌ అనే నేను చిత్రం తర్వాత మహేష్‌ బాబు నటిస్తున్న చిత్రం అవ్వడంతో పాటు మహేష్‌ కెరీర్‌ లో 'మహర్షి' 25వ చిత్రం అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్‌ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తుంది. మహేష్‌ తో పాటు ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.