Begin typing your search above and press return to search.

డైలమాలో స్టార్ ప్రొడ్యూసర్...?

By:  Tupaki Desk   |   17 July 2020 2:00 PM IST
డైలమాలో స్టార్ ప్రొడ్యూసర్...?
X
కరోనా మహమ్మారి కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేయరు అని భావించిన కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం తమ సినిమాలను డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. అయితే స్టార్ హీరోల సినిమాలు మరియు క్రేజీ మూవీస్ మేకర్స్ మాత్రం ఓటీటీలో రిలీజ్ చేయాలో.. థియేటర్స్ తెరుచుకునే దాకా వెయిట్ చేయాలో అర్థం కాక సందిగ్ధంలో పడ్డారు. అలాంటి మూవీస్ లో నాని - సుధీర్ బాబు హీరోలు గా నటించిన 'వి' సినిమా కూడా ఒకటి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. అదితి రావ్ హైదరి - నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న 'వి' సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల వాయిదాపడింది.

ఇక దిల్ రాజు నిర్మిస్తున్న మరో సినిమా 'వకీల్ సాబ్'. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' కొంతమేర షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. ఈ సినిమా కూడా అనుకున్న ప్రకారం షూటింగ్ జరిగితే మే నెలలో రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు దిల్ రాజు హిందీలో రీమేక్ అవుతున్న 'జెర్సీ' సినిమాకి కూడా ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు ఎక్కడికక్కడ లాక్ అయి ఉన్నాయి. ఇలా మూడు చిత్రాలు హోల్డ్ లో ఉండటం.. ఇక కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలో థియేటర్స్ తెరుచుకోనే సూచనలు కనిపించకపోవడంతో దిల్ రాజు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'వి' సినిమా ఓటీటీ లో రిలీజ్ చేసే ఆలోచన చేసున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా కంప్లీట్ అయి నాలుగు నెలలు అవుతోంది. దీనిపై భారీగానే పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే ఈ సినిమా బయటకి రావాలి. ఒకవేళ ఓటీటీ రిలీజ్ కి సిద్ధపడ్డా ఎలాంటి డీల్ దక్కించుకుంటుందో అనే డౌట్. ఇలా నిర్మాణ దశలో ఉన్న సినిమాలు ఆగిపోయి.. కంప్లీట్ అయిన సినిమాలను రిలీజ్ చేసుకోలేక దిల్ రాజు సందిగ్ధంలో ఉన్నారని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.