Begin typing your search above and press return to search.

లేదు బాబూ.. పూరీనే స్వయంగా అడిగాడు

By:  Tupaki Desk   |   13 May 2016 7:00 PM IST
లేదు బాబూ.. పూరీనే స్వయంగా అడిగాడు
X
వరుస ఫెయిల్యూర్స్ తో పూరీ జగన్నాధ్ డీలా పడ్డాడని అందరూ అనకుంటున్న టైంలో.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు.. సినిమా పూర్తయిపోతున్నా టైటిల్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండే రోజుల్లో.. ఇంకా ఫైనల్ కాని ప్రాజెక్టుకి టైటిల్ పెట్టి.. ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు పూరీ.

జన గణ మన టైటిల్ విషయంలో చాలానే రూమర్స్ వినిపించాయి. ఈ పేరుతో సినిమా చేస్తామని గతంలో చాలామంది చెప్పడమే ఇందుకు కారణం. దీనికి తోడు దిల్ రాజు రిజిస్టర్ చేసిన టైటిల్ తో పూరీ సినిమా తీస్తాననడం కూడా వింతగా అనిపించింది. ఛార్మీ ఈటైటిల్ పై సినిమా చేస్తుందనే రూమర్ పుట్టించి.. ఆమె ద్వారా టైటిల్ ని పూరి దక్కించుకున్నాడనే టాక్ కూడా వచ్చింది. అయితే.. ఇవన్నీ రూమర్స్ అని తేల్చేశాడు దిల్ రాజు. సుప్రీమ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు జన గణ మనపై క్లారిటీ ఇచ్చేశాడు.

'ఈ టైటిల్ పై సినిమా చేద్దామని అనుకున్న మాట వాస్తవమే. కానీ ప్రాజెక్టు ఫైనలైజ్ కాలేదు. ఇంతలో పూరీ జగన్నాథ్ అడిగితే నేనే ఇచ్చేశాను. కానీ వేరే హీరోయిన్ పేరు చెప్పి తీసుకున్నాడనే టాక్ వచ్చింది. లేదు బాబు.. పూరీనే స్వయంగా అడిగాడనే ఇచ్చాను' అని చెప్పాడు దిల్ రాజు. అయితే.. ఈ టైటిల్ మహేష్ కోసం అడిగినట్లు తెలుసా అంటే మాత్రం రియాక్ట్ కాకపోవడం గమనించాలి.