Begin typing your search above and press return to search.

రాజు గారి బిజినెస్ స్ట్రాటజీ బాగుందే

By:  Tupaki Desk   |   4 Sept 2019 1:21 PM IST
రాజు గారి బిజినెస్ స్ట్రాటజీ బాగుందే
X
ఏ వ్యాపారంలో అయినా సుదీర్ఘ కాలం కొనసాగి సక్సెస్ కావాలి అంటే డబ్బుంటే సరిపోదు. దానికి మించిన తెలివితేటలు సమయానుకూలంగా వ్యవరించే నేర్పు ఉండాలి. అవి ఉన్నప్పుడు ఎంతదాకైనా వెళ్ళొచ్చు. దిల్ రాజు ఈ సూత్రాన్ని పాటిస్తూ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా డ్యూయల్ రోల్ ని సమర్దవంతంగా పోషిస్తున్నారు. ఇటీవలి కాలంలో దిల్ రాజు భారీ సినిమాల నిర్మాణం తగ్గించేశారు.

మహేష్ బాబు లాంటి స్టార్లతో వరస ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నా ఆయన సోలో ప్రొడ్యూసర్ కాదు. ఇద్దరు ముగ్గురు భాగస్వామ్యంలో తానూ ఒకరిగా ఉంటున్నారు తప్ప వాటికి సోలో ప్రొడ్యూసర్ గా సింగల్ కార్డు వేసుకోవడం లేదు. మరోవైపు చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలను మాత్రం తన స్వంత బ్యానర్ మీద నిర్మాణం చేస్తూ సరైన టైమింగ్ లో రిలీజులు ప్లాన్ చేసుకుంటున్నారు

ఇది ఒకరకంగా మంచి బిజినెస్ స్ట్రాటజీ. మీడియం రేంజ్ సినిమాలతో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆడినా ఆడకపోయినా శాటిలైట్ డిజిటల్ అంటూ రకరకాల హక్కుల రూపంలో పెట్టుబడి వచ్చేస్తుంది. అదే పెద్ద సినిమాలకు కేవలం బయ్యర్ గా ఉంటే రిస్క్ తగ్గిపోయి భారం సదరు నిర్మాత మీద ఉంటుంది. ఒకవేళ పార్టనర్ అయితే పంచుకుంటారు కాబట్టి నష్టం తగ్గుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదీ తెలివైన ఎత్తుగడే. ఒకప్పుడు క్రేజీ స్టార్ మూవీస్ ని లైన్ లో పెట్టిన దిల్ రాజు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయడం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది కదా