Begin typing your search above and press return to search.
దిల్ రాజు హీరోగా చేస్తున్నాడా?
By: Tupaki Desk | 2 Nov 2016 9:00 PM ISTఈ వయసులో దిల్ రాజు హీరో కావడమేంటి అని షాకైపోతున్నారా..? ఇది ఒక సరదా ఆలోచన మాత్రమేలెండి. తన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తమిళ డబ్బింగ్ మూవీ ‘రెమో’ ఆడియో వేడుకకు వచ్చిన సందర్భంగా దిల్ రాజును చూసిన వాళ్లకు ఆయన నటనలోకి అడుగుపెట్టేస్తున్నాడేమో.. హీరో అయిపోతాడేమో అన్న సందేహాలు కలిగితే ఆశ్చర్యమేమీ లేదు. రాజు ఒరిజినల్ వయసెంతో తెలియనట్లుగా ఫిజిక్ మెయింటైన్ చేస్తాడన్న సంగతి తెలిసిందే కానీ.. నిన్న ఔట్ ఫిట్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు రాజు.
టాప్ టు బాటమ్ ఆయన వేసుకున్న డ్రెస్.. యాక్సెసరీస్ అన్నీ కూడా ఈ తరం కుర్రాళ్ల తరహాలో కనిపించాయి. షూస్.. గాగుల్స్.. అన్నీ కూడా ఓ రేంజిలో మెయింటైన్ చేశాడు. ముఖ్యంగా గాగుల్స్ చొక్కా బొత్తానికి తగిలించుకుని ఆయన విచ్చేసిన తీరు జనాలకు షాకింగే. మామూలుగా కొంచెం పెద్ద మనిషి తరహాలో సింపుల్ గా తయారై వచ్చే రాజు.. ‘రెమో’ వేడుకకు మాత్రం చాలా స్టైలిష్ ఔట్ ఫిట్ తో విచ్చేశాడు. హీరో శివ కార్తికేయన్ కు గట్టి పోటీ ఇచ్చాడు. ఫిజిక్ ఎలాగూ బాగానే మెయింటైన్ చేస్తుండటంతో.. ఈ లుక్ లో ఆయన్ని చూస్తే.. ఆల్రెడీ రాజుకు పెళ్లి అయిన కూతురు కూడా ఉందంటే ఎవ్వరూ నమ్మరేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/