Begin typing your search above and press return to search.
దిల్ రాజుకేమైనా మెంటలా అన్నారు!
By: Tupaki Desk | 30 Jan 2020 11:17 AM ISTరెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఉన్న ప్రాధాన్యత ప్రయోగాలకు ఇన్నాళ్లు అవకాశం లేదు. కానీ ఇటీవల ట్రెండ్ మారింది. ఏదైనా సినిమా కమర్షియల్ అంశాలతో పాటు వైవిధ్యమైన కథాంశం ఉండి తీరాల్సిందే. గ్రిప్పింగ్ నెరేషన్ తో కుర్చీ అంచున కట్టేయకపోతే ఆడియెన్ థియేటర్లకు రావడం లేదు. మరి త్వరలో రిలీజ్ కి వస్తున్న జాను సినిమా ఏ కేటగిరీకి చెందుతుంది? క్లాసా మాసా అంటే ఇది పూర్తిగా క్లాస్ ఆడియెన్ ని టచ్ చేస్తుందనే భావిస్తున్నారు.
అయితే ఈ సినిమాని ప్రారంభించక ముందే రాజు గారిపై చాలా కామెంట్లు వినిపించాయి. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన క్లాసిక్ సినిమా 96ని తెలుగులో రీమేక్ చేయాలనుకోవడం ఒక సాహసం అని అన్నారు. ఇది ఇక్కడ హిట్టవ్వదు అన్న కామెంట్లు కూడా వినిపించాయి. అయితే వీటన్నిటిపైనా తాజాగా జాను ప్రెస్ మీట్లో దిల్ రాజు స్పందించారు. ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. 96 సినిమా ను తమిళంలో రిలీజ్ కంటే ఓ నెల ముందే చూశాను. ప్రివ్యూ థియేటర్ నుండి బయటకు రాగానే తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్సయ్యాను. ఈ సినిమాకు శర్వా- సమంత జంట ఫైనల్ కాకముందు చాలా చాలా అనుకున్నాను. ఆ సమయం లో చాలా కామెంట్స్ వినిపించాయి. వీళ్లకేమైనా పిచ్చా? అదొక క్లాసిక్ మూవీ... పాడు చేస్తారా? దిల్‌రాజుకేమైనా మెంటలా? ఎందుకు రీమేక్ చేస్తున్నాడు? అని చాలా కామెంట్స్ వచ్చాయి`` అని తెలిపారు. తొలుత నాకు ఏమీ అర్థం కాలేదు. ఒక ఆడియన్ గా నేను సినిమా చూశాను. తమిళం నాకు పూర్తిగా రాదు. అయినా కూడా పాత్రలతో నేను ట్రావెల్ అయ్యి.. సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాను. నేను ఏదైనా ఆరోజు నమ్మానో..ఈరోజు కూడా అదే నమ్ముతున్నాను. సామ్ సినిమా చూసి ఓరిజినల్ డైరెక్టర్ అయితేనే సినిమా చేస్తానని అంది. చివరకు నేను ఓరిజినల్ డైరెక్టర్‌నే తెచ్చాను. రెండు రోజుల తర్వాత తనే ఫోన్ చేసి నాకు థ్యాంక్స్ చెప్పడమే కాదు.. మేజిక్ ను ప్రతిరోజూ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. శర్వా ఒక అందమైన అనుభూతినిచ్చారని అనడం ఆనందం కలిగింది అని తెలిపారు.
నా పదిహేడేళ్ల కెరీర్ లో తొలి రీమేక్ జాను. తమిళ చిత్రం 96కు ఇది రీమేక్. ఎప్పుడైనా రీమేక్ చేయాలంటే ఏముంటుందిలే అనుకునేవాడిని. అలా అంతకు ముందు రెండు సినిమాలు రీమేక్ చేద్దామనుకుని మిస్ అయ్యాను. ఈసారి కుదిరింది అని దిల్ రాజు తెలిపారు. ఫిబ్రవరి 7న తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నామని వెల్లడించారు.