Begin typing your search above and press return to search.

డెబ్యూ హీరో పై అగ్ర‌నిర్మాత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   24 Jan 2022 3:38 AM GMT
డెబ్యూ హీరో పై అగ్ర‌నిర్మాత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X
గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఏదీ అంత సులువేమీ కాదు. ఇక్క‌డ సినీ నేప‌థ్యం ఉన్నా.. న‌ట‌వార‌సులుగా రంగ ప్ర‌వేశం చేసినా కుటుంబ అండ‌దండ‌లు ఉన్నా కానీ గ‌ట్సీగా హిట్లు కొట్టి నిరూపిస్తేనే త‌దుప‌రి ఛాన్సుంటుంది. ఇదే విష‌యాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు మ‌రోసారి ధృవీక‌రించారు.

సినీనేప‌థ్యం ఉన్నంత మాత్రాన హీరోలు అయిపోలేరు.. నిరూపించుకోవాల్సి ఉంటుంది! అని దిల్ రాజు అన్నారు. ఇంత‌కుముందు చాలా మంది ఇలానే వ‌చ్చినా స‌క్సెస్ కాని వారిని ఉద‌హ‌రించారు. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి.. కె.రాఘవేంద్రరావు వంటి ప్ర‌ముఖుల వార‌సుల స‌న్నివేశం తెలిసిందే క‌దా... అగ్ర ద‌ర్శ‌కులు ఫామ్ లో ఉన్నా కానీ వీళ్లు నిరూపించుకోలేక‌పోయార‌ని అన్నారు.

ప‌నిలో ప‌నిగా ఈ సంక్రాంతి బ‌రిలో రౌడీ బోయ్స్ చిత్రంతో ప‌రిచ‌య‌మైన త‌న సోద‌రుడి కుమారుడు ఆశిష్ హీరోగా నిల‌దొక్కుకోవాలంటే చాలా నిరూపించాలని దిల్ రాజు అన్నారు. ఆశిష్ న‌టించిన‌ మొద‌టి సినిమా రౌడీ బోయ్స్ తో ఎంత సంపాదించాం అన్న‌ది కాదు ఎంత‌మంది థియేట‌ర్ల‌కు వ‌చ్చారు! అన్న‌దే చూస్తున్నాన‌ని దిల్ రాజు అన్నారు. తెలుగు చిత్ర‌సీమ మునుముందు మ‌రింత‌గా వెలిగిపోతుంద‌ని కంటెంట్ డ్రివెన్ ప‌రిశ్ర‌మ‌గా రాణిస్తుంద‌ని దిల్ రాజు త‌న అభిప్రాయం తెలిపారు.