Begin typing your search above and press return to search.

#దిల్ రాజుకి 50.. పుట్టిన‌రోజే భార్య ప‌రిచ‌యం..

By:  Tupaki Desk   |   17 Dec 2020 9:35 AM IST
#దిల్ రాజుకి 50.. పుట్టిన‌రోజే భార్య ప‌రిచ‌యం..
X
ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు దిల్ రాజుకు నేటి (17 డిసెంబర్)తో 50 ఏళ్లు. ఆయ‌న‌ కుమార్తె అన్షితా రెడ్డి `దిల్ రాజుకు అర్ధ శతాబ్దం` పేరుతో ప్రత్యేక పార్టీకి ప‌రిశ్ర‌మ‌ను ఆహ్వానిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని దిల్ రాజు స్వ‌గృహం నందు నేటి సాయంత్రం ఈ సెల‌బ్రేష‌న్స్ ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

2019-20 సీజ‌న్ దిల్ రాజు కెరీర్ ప‌రంగా పూర్తి బిజీ. వ‌రుస‌గా భారీ క్రేజీ చిత్రాల్ని నిర్మిస్తూనే న‌వ‌త‌రం హీరోలతోనూ సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా `వకీల్ సాబ్` చిత్రీక‌ర‌ణ‌ చివరి దశలో ఉంది. త్వరలో బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2 కి సీక్వెల్ ప్రారంభించనున్నారు. అలాగే `జెర్సీ` రీమేక్ ‌తో బాలీవుడ్ లో ని‌ర్మాత‌గా అడుగుపెడుతున్నారు. సినిమాల రిలీజ్‌ వేళ దిల్ రాజు పార్టీల సంగ‌తి స‌రే కానీ.. ఆయ‌న హాఫ్ సెంచ‌రీ సెల‌బ్రేష‌న్ కి మాత్రం అతని కుమార్తె హన్షితా రెడ్డి సినిమా పరిశ్రమల కోసం వారి ఇంటి వద్ద విలాసవంతమైన విందును నిర్వహిస్తున్నారు. నేడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు.

దిల్ రాజు వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల‌త గురించి తెలిసిన‌దే. మొదటి భార్య అనిత అనారోగ్యం కారణంగా 2017 లో కన్నుమూసిన తరువాత ఆయ‌న ఈ సంవత్సరం మే లో వైఘా రెడ్డి(తేజ‌స్విని)ని వివాహం చేసుకున్నారు. ఇది అతని రెండవ వివాహం. ఒక ఆలయంలో లాక్ డౌన్ సమయంలో వైఘా రెడ్డితో ఈ వివాహం ఓ ప్రైవేట్ ఆత్మీయ వేడుకగా సాగింది. కోవిడ్ వ‌ల్ల ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌కు అప్ప‌ట్లో విందు కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌లేదు. కాబట్టి తన వివాహ రిసెప్షన్ ‌ను నేటి పుట్టినరోజు విందును రెండింటినీ ఒకటిగా ప్లాన్ చే‌శార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ప‌రిశ్రమకు చెందిన ప్ర‌ముఖుల‌కు డిసెంబ‌ర్ 18న స్పెష‌ల్ పార్టీకి ఆహ్వానాలు అందాయ‌ని తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఒక లగ్జరీ హోటల్ లో ఈ కార్యక్రమం జ‌ర‌గ‌నుంద‌ని తెలిసింది.