Begin typing your search above and press return to search.

రాబోయే 10 ఏళ్లలో ఏ ఇండియన్‌ మూవీ ఈ రికార్డు బ్రేక్‌ చేయలేక పోవచ్చు

By:  Tupaki Desk   |   28 July 2020 5:30 PM GMT
రాబోయే 10 ఏళ్లలో ఏ ఇండియన్‌ మూవీ ఈ రికార్డు బ్రేక్‌ చేయలేక పోవచ్చు
X
సుశాంత్‌ నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’ ఇటీవలే ఓటీటీ డిస్నీ హాట్‌ స్టార్‌ ద్వారా విడుదలైన విషయం తెల్సిందే. సినిమా ట్రైలర్‌ కు అనూహ్య స్పందన రావడంతో సినిమా కూడా ఖచ్చితంగా రికార్డు స్థాయి వ్యూస్‌ ను దక్కించుకుంటుందని మొదటి నుండి అనుకున్నారు. పైగా హాట్‌ స్టార్‌ సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకోని వాళ్లకు కూడా ఈ సినిమా చూసే అవకాశంను కల్పించారు. సుశాంత్‌ కు నివాళిగా అభిమానులు అంతా ఈ సినిమా చూసేలా చేశారు. దాంతో హాలీవుడ్‌ సినిమాల రికార్డులను కూడా దిల్‌ బేచారా బ్రేక్‌ చేసింది.

కేవలం 24 గంటల వ్యవధిలో ఈ చిత్రం ఏకంగా 95 మిలియన్‌ ల వ్యూస్‌ ను దక్కించుకుందని హాట్‌ స్టార్‌ అధికారికంగా పేర్కొంది. ఇప్పటి వరకు ఓటీటీ చరిత్రలో ఏ సినిమా కాని వెబ్‌ సిరీస్‌ కాని ఈ స్థాయిలో వ్యూస్‌ ను దక్కించుకోలేదు. నెట్‌ ఫ్లిక్స్‌ లో సూపర్‌ హిట్‌ గా నిలిచిన ఎక్స్‌ ట్రాక్షన్‌ నెత రోజులకు గాను 99 మిలియన్‌ ల వ్యూస్‌ ను పొందింది. అలాంటిది దిల్‌ బేచారా మాత్రం కేవలం 24 గంటల్లో 95 మిలియన్‌ ల వ్యూస్‌ ను దక్కించుకోవడం వరల్డ్‌ రికార్డు గా చెబుతున్నారు.

రాబోయే పదేళ్ల వరకు ఏ ఇండియన్‌ మూవీ కూడా ఈ స్థాయిలో వ్యూస్‌ ను రాబట్టుకోలేక పోవచ్చు. ఎందుకంటే ఏ సినిమాను కూడా ఫ్రీగా స్ట్రీమింగ్‌ చేయరు. ఇక ప్రస్తుత పరిస్థితులు తర్వాత ఉండక పోవచ్చు. అందుకే రాబోయే పదేళ్ల వరకు దిల్‌ బేచారా రికార్డు పదిలంగా ఉంటుందని సుశాంత్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌ మృతి సానుభూతితో పాటు సినిమాకు మంచి టాక్‌ రావడంతో ఇంత భారీ స్థాయి వ్యూస్‌ వచ్చాయి. రెండవ రోజు మూడవ రోజు కూడా భారీ స్థాయిలో వ్యూస్‌ వస్తున్నాయి. 300 మిలియన్‌ వ్యూస్‌ కు ఈ చిత్రం రీచ్‌ అయ్యే అవకాశం ఉందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.