Begin typing your search above and press return to search.

హీరో చివరి చిత్రానికి మరో రికార్డు

By:  Tupaki Desk   |   25 July 2020 9:50 AM GMT
హీరో చివరి చిత్రానికి మరో రికార్డు
X
సుశాంత్‌ హీరోగా సంజనా సంఫీు హీరోయిన్‌ గా ముఖేష్‌ చాబ్రా దర్శకత్వంలో రూపొందిన ‘దిల్‌ బేచారా’ చిత్రం నిన్న డిస్నీ హాట్‌ స్టార్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ట్రైలర్‌ కు యూట్యూబ్‌ లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ లైక్స్‌ వచ్చాయి. ఏ ఇండియన్‌ సినిమా సాధించని ఘనత దిల్‌ బేచారాకు దక్కింది. ఇప్పుడు మరో అరుదైన ఘనత ఈ చిత్రంకు దక్కింది. ఇండియన్‌ సినిమాల జాబిత అంతా ఐఎంబీడీలో ఉంటుంది. అక్కడ సినిమాలకు రేటింగ్స్‌ ఓటింగ్స్‌ ఉంటాయి.

ఐఎంబీడీలో అత్యధిక ఓట్లు దక్కించుకున్న చిత్రంగా మరియు అత్యధిక రేటింగ్‌ దక్కించుకున్న చిత్రంగా దిల్‌ బేచారా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 21 వేలకు పైగా ఓట్లు నమోదు అవ్వడంతో పాటు 9.8 రేటింగ్‌ ను నెటిజన్స్‌ సినిమాకు ఇచ్చారు. సినిమా విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఇన్ని ఓట్లు మరియు ఇంత రేటింగ్‌ రావడం రికార్డుగా చెప్పుకోవచ్చు. భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు ఏ సినిమాకు ఈ స్థాయి రేటింగ్‌ రాలేదంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఆత్మహత్య చేసుకున్న సుశాంత్‌ పై సింపతీతో ఈ స్థాయి రేటింగ్‌ దక్కింది అనేవారు కూడా లేకపోలేదు. సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ను సుశాంత్‌ ఇచ్చాడని అతడి మృతికి ఈ మూవీ ఘన నివాళి అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సుశాంత్‌ మృతి చెందిన నెల రోజుల్లోనే వచ్చిన ఈ సినిమాకు బాగా పబ్లిసిటీ దక్కింది మరియు బాగా వర్కౌట్‌ అయ్యిందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.