Begin typing your search above and press return to search.

డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలక్షన్.. అసలు కాజల్ ప్లాన్ ఏంటి..??

By:  Tupaki Desk   |   3 Jun 2021 8:00 AM IST
డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలక్షన్.. అసలు కాజల్ ప్లాన్ ఏంటి..??
X
దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. పెళ్లికి ముందు స్లో అనిపించింది. కానీ పెళ్లి చేసుకొని ఒక్కసారిగా సినిమాల విషయంలో వేగం పెంచేసింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. అయితే ఈ భామ ఫస్ట్ టైం టాలీవుడ్ కింగ్ నాగార్జున సరసన నటిస్తోంది. కింగ్ నాగ్ హీరోగా `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కాగా ఈ సినిమాలో కాజల్ కీలకపాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో కాజల్ ఇంతవరకు చూడని న్యూ లుక్కులో కనిపించనుందని టాక్. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు.

అలాగే కాజల్ పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన వివరాలు తెలిపాడు. ఈ యాక్షన్ మూవీలో కాజల్ `రా` ఏజెంట్ గా కనిపించనుందట. అలాగే కాజల్ ఇదివరకటిలా కాకుండా ఈ సినిమాలో నెవర్ బిఫోర్ లుక్‌లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో అలరించనుందని తెలుస్తుంది. అమ్మడు తన పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందట కాజల్. అందులో భాగంగానే కాజల్ మార్షల్ ఆర్ట్స్ - రైఫిల్ షూటింగ్ లాంటివి కూడా నేర్చుకుంటుందట. ఈ సినిమా కాకుండా కాజల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశలో ఉంది.

అలాగే కాజల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఇండియన్-2 సినిమాలో కూడా నటిస్తోంది. కానీ ఆ సినిమా ప్రస్తుతం నిలిచిపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే అమ్మడు లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ తో ఓటిటిలో అడుగుపెట్టింది. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ వెబ్ సిరీస్ కాజల్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కాజల్ మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతున్నట్లు టాక్. పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో కాజల్ ఓ లేడీ ఓరియెంటెడ్ సస్పెన్సు థ్రిల్లర్ ఓకే చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. కాజల్ పెళ్లి తర్వాత ప్రయోగాలు చేయడం మొదలు పెట్టింది. మొత్తానికి కాజల్ ఫ్యాన్స్ అయితే హ్యాపీనే అని చెప్పాలి.