Begin typing your search above and press return to search.

కామెడీలోనూ కంటెంటే ముఖ్యం!

By:  Tupaki Desk   |   21 Nov 2018 2:30 PM GMT
కామెడీలోనూ కంటెంటే ముఖ్యం!
X
మొన్న బాక్స్ ఆఫీస్ దగ్గర హోరా హోరి పోరు తప్పదు అనుకుంటే అనూహ్యంగా అమర్ అక్బర్ ఆంటోనీ దారుణంగా దెబ్బ తినగా ఊహించని రీతిలో టాక్సీవాలా విన్నర్ గా నిలవడం ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది.ఈ విజయంతో ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యింది . కంటెంట్ కింగ్ అని. ఒకప్పుడు చిరంజీవి లాంటి స్టార్ హీరోల ఫ్లాప్ సినిమాలు సైతం నష్టాలు రాకుండా కాపాడేవి. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. బాగుంటే హీరో ఎవరు అని పట్టించుకోకుండా ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.

అమర్ అక్బర్ అంటోనీ-టాక్సీవాలాలలో ఒక పోలిక కామన్ గా కనిపిస్తుంది. అదే కామెడీ. టాక్సీవాలాలో హాస్యాన్ని ఇద్దరే మోసారు. విజయ్ దేవరకొండ ఫ్రెండ్ కం గ్యారేజ్ ఓనర్ గా మధు నందన్ ఒకరైతే అతని పక్కన అసిస్టెంట్ గా హాలీవుడ్ పాత్రలో చెలరేగిపోయిన విష్ణు మరొకరు. అక్కడక్కడా చమ్మక్ చంద్ర మెరిపించినా అది కేవలం రెండు మూడు సన్నివేశాలకే పరిమితమయ్యింది కాబట్టి భారం వీళ్ళ మీదే పడింది. ఎక్కువ పంచులు లేకుండా కేకలు వెయ్యకుండా కూల్ గా నవ్వులు పూయించడం హెల్ప్ అయ్యింది.

ఇక అమర్ అక్బర్ అంటోనీ విషయానికి వస్తే టాలీవుడ్ టాప్ కమెడియన్స్ అందరిని సెట్ చేసాడు శీను వైట్ల. వేషాలు తగ్గించుకున్న జయ ప్రకాష్ రెడ్డి మొదలుకుని మంచి ఫాం లో ఉన్న శ్రీనివాసరెడ్డి దాకా బ్యాచ్ మొత్తాన్ని దింపేసాడు. ఆఖరికి సీరియస్ గా కనిపించే భరత్ రెడ్డిని కూడా హాస్యానికే వాడుకున్నాడు. అయినా ఫలితం శూన్యం. వాటా సంఘం అంటూ రాసిన ట్రాక్ అపహాస్యం పాలవగా రవితేజతో అక్బర్ అంటోనీల రూపంలో చేయించిన డ్రామా కూడా రివర్స్ కొట్టింది.

రివెంజ్ డ్రామాలో ఇదంతా అతకలేదు సరికదా అసలుకే మోసాన్ని తెచ్చింది. అందుకే టాక్సీవాలాలో ఉన్న మధునందన్-విష్ణులకు వచ్చిన పేరులో ఈ కామెడీ బ్యాచ్ మొత్తం సగం కూడా తెచ్చుకోలేకపోయారు. జానర్ ఏదైనా కామెడీ విషయంలో కంటెంటే కింగ్ అని మరోసారి ప్రూవ్ అయ్యిందిగా