Begin typing your search above and press return to search.

'సేనాని' సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన డై హార్డ్ ఫ్యాన్స్...!

By:  Tupaki Desk   |   16 Aug 2020 9:00 PM IST
సేనాని సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన డై హార్డ్ ఫ్యాన్స్...!
X
ప్రస్తుతం సెలబ్రిటీల బర్త్ డే నాడు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ చేయడంట్రెండ్ గా మారింది. తమ అభిమాన హీరో పుట్టినరోజుకి ఓ కామన్ డీపీ డిజైన్ చేసి.. ట్విట్టర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ #MaheshBabuBdayCDP అనే హ్యాష్ ట్యాగ్ తో 24 గంటల్లో 31.1 మిలియన్ ట్వీట్స్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా మహేష్ బర్త్ డే నాడు #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్స్ తో 24 గంటల్లో 60.2 మిలియన్ ట్వీట్స్ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో బర్త్ డేని ట్రెండ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

కాగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. రెండు వారాల ముందే పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేసారు. 'సేనాని' అనే పేరుతో పవన్ కళ్యాణ్ కామన్ డీపీని డిజైన్ చేసారు. ట్విట్టర్ లో #PawanKalyanBirthdayCDP హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్‌ చేయడం స్టార్ట్ చేసారు. ఇప్పటికే సుమారు 50 మిలియన్ ట్వీట్స్ తో ఇండియాలో టాప్ ట్రెండ్ లో ఉంచడంతో పాటు మహేష్ బర్త్ డే సీడీపీ రికార్డ్ ని బ్రేక్ చేశారు. ఈ ట్రెండ్ లో బీజేపీ ఐటీ సెల్ మరియు జనసేన ఐటీ సెల్ కూడా పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు మహేష్ బర్త్ డే ట్రెండ్ ని బ్రేక్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తోంది.