Begin typing your search above and press return to search.

సుశాంత్ ఆత్మహ‌త్య చేసుకోలేదా? అర్న‌బ్ బ్లాస్ట్ చేయ‌బోయేదేమిటో?

By:  Tupaki Desk   |   4 Oct 2020 4:40 PM IST
సుశాంత్ ఆత్మహ‌త్య చేసుకోలేదా? అర్న‌బ్ బ్లాస్ట్ చేయ‌బోయేదేమిటో?
X
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని ఏయిమ్స్ డాక్ట‌ర్లు ఇటీవ‌ల సీబీఐకి రిపోర్ట్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వెలువ‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసులో సోమావారం ట్విస్ట్ ఇవ్వ‌బోతున్నార‌ట జాతీయ మీడియా ఛాన‌ల్ రిప‌బ్లిక్ టీవి ఛీఫ్ ఎడిట‌ర్ అర్న‌బ్ గోస్వామి. సీబీఐ సుశాంత్ కేస్ ని టేక‌ప్ చేసిన ద‌గ్గ‌రి నుంచి వ‌రుస లీకులు బ‌య‌టికి ఇవ్వ‌డంలో రిప‌బ్లిక్ చానెల్ పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా రిప‌బ్లిక్ చానెల్ యాంక‌ర్ కం ఛీఫ్ అర్న‌బ్ ప్ర‌క‌ట‌న‌తో స‌న్నివేశం హీటెక్కింది. దీంతో ఈ కేసుపై యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

ఈ నేప‌థ్యంలో సుశాంత్ కేసుకు సంబంధించిన అస‌లు నిజాన్ని సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు అర్న‌బ్ గోస్వామి బ్లాస్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ఒకే సారి రిప‌బ్లిక్ టీవీ- రిప‌బ్లిక్ భార‌త్ - రిప‌బ్లిక్ వ‌ర‌ల్డ్ టీవీల్లో అర్న‌బ్ గోస్వామి సంచ‌ల‌నం సృష్టించ‌బోతున్నార‌ట‌. సుశాంత్ కేసు విష‌యంలో వ‌చ్చిన లీకులు ఇంత వ‌ర‌కు ఏ కేసులోనూ బ‌య‌టికి రాక‌పోవ‌డంతో జ‌నం రాబోవు మండే కోస‌మే వెయిటింగ్. అర్న‌బ్ ఎలాంటి బ్లాస్ట్ చేయ‌బోతున్నారో అని యావ‌త్ మీడియా వ‌ర‌ల్డ్ స‌హా యావ‌త్ ప్రపంచం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న విష‌యాల‌పై అర్న‌బ్ గోస్వామి మాట్లాడారు. నిన్నటి నుండి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు అతని మద్దతుదారులు బాధపడుతున్నారు. భ‌యంక‌ర‌మైన నిజం తెలిసి మోస‌పోయామ‌ని భావిస్తున్నారు. వారంద‌రి త‌రుపున నేను పిలుపునిస్తున్నాను. ఫోరెన్సిక్ అధిపతి ఛీఫ్‌ డాక్టర్ సుధీర్ గుప్తాను ఉటంకిస్తూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నాను. సుశాంత్ కేసు ఒక సాధారణ ఆత్మహత్య కేసు అని ఎయిమ్స్ విభాగం ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ప్ర‌తీ ఒక్క‌రు నన్ను అడిగారు. మ‌నం ఇప్పుడు ఏం చేద్దాం అని. ఇలా ఓ చేదు నిజాన్ని ఎందుకిలా అబ‌ద్ధంగా మార్చి చెబుతున్నారు? వాస్తవాలకు పూర్తిగా విరుద్ధంగా ఎందుకు చెబుతున్నారు. అని ప్ర‌శ్నిస్తున్నారు. అలా అయితే ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ చీఫ్ ఎందుకు కన్నీటి పర్యంతమయ్యారు? ` అని ప్ర‌శ్నల వ‌ర్షం కురిపిస్తున్నారు. సుశాంత్ ది హ‌త్య కాదు ఆత్మ హ‌త్య అని చెప్ప‌మ‌ని ఆయ‌న తొంద‌ర ప‌డుతున్నారు. ఆయ‌న‌తో అలా చెప్పిస్తున్న‌ది ఎవ‌రు? అలా చెప్ప‌మ‌ని ఒత్తిడి చేస్తున్నారా? ఎందుకింతలా ఆయ‌న భ‌య‌ప‌డుతున్నారు? వ‌ంటి అనేక విష‌యాల్ని అర్న‌బ్ సోమ‌వారం బ్రేక్ చేయ‌బోతున్నార‌ట‌.