Begin typing your search above and press return to search.

ఐదు నిమిషాల్లోనే ఇంత హాట్ ఫోటో తీశాడా?

By:  Tupaki Desk   |   14 Jan 2021 8:24 AM GMT
ఐదు నిమిషాల్లోనే ఇంత హాట్ ఫోటో తీశాడా?
X
శ‌ర్మా సిస్ట‌ర్స్ నేహాశ‌ర్మ‌-ఐషా శ‌ర్మల ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 2019-20 సీజ‌న్ ఈ భామ‌ల‌దే. నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో అభిమానుల కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ముఖ్యంగా నేహా సోద‌రి ఐషా అయితే అడ్డూ ఆపూ లేకుండా వ‌రుసగా హీటెక్కించే ఫోటోల్ని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది.

తాజాగా అలాంటి ఓ అరుదైన ఫోటోతో సంక్రాంతి ట్రీటిచ్చింది అమ్మ‌డు. బ్లాక్ ఇన్ వోర్.. బ్లాక్ బ‌ట‌న్ షార్ట్ లో ద‌ర్శ‌న‌మిచ్చిన ఈ బ్యూటీ టోట‌ల్ టాప్ టు బాటమ్ బ్లాక్ లో హీటెక్కించింది. సీకే బ్రాండ్ కే కాంపిటీటివ్ బ్రాండ్ ని ప్ర‌చారం చేస్తోందా? అన్నంతగా చెల‌రేగింది.

ఈ ఫోటో తీయడానికి గడిపిన సమయం - 5 నిమిషాలు. నవ్వుతూ గడిపిన సమయం - 20 నిమిషాలు. నేను జీవితంలో చాలా విషయాలు గుర్తుంచుకుంటాను. ఇది ఎంత ఆనందాన్ని తెచ్చిపెట్టింది? ధన్యవాదాలు.. అంటూ ముసిముసిగా న‌వ్వేసింది. ఫారోఖోథియా ఫోటో కోసం ఇంత‌గా శ్ర‌మించాన‌ని ఐషా శ‌ర్మ తెలిపింది. అంత‌సేపు నవ్వినందుకు ఎక్కువ శ్ర‌మించాల్సొచ్చింద‌న్న హింట్ కూడా ఇచ్చింది. అన్న‌ట్టు ఫోటోషూట్ కోస‌మే అంత‌గా శ్ర‌మించాన‌ని ఇదైపోతే న‌టించేందుకు ఇంకెంత క‌ష్ట‌ప‌డిపోతుందో? మ‌హాన‌టిలా ఒంటి క‌న్నుతో ఏడ్వాలి! అని ద‌ర్శ‌కుడు కోరితే ఏడ్చి నిరూపిస్తుందంటారా?