Begin typing your search above and press return to search.

పిక్‌ః అల్లూరి రామ్‌ గోపాల్‌ వర్మను చూశారా

By:  Tupaki Desk   |   28 March 2021 3:30 PM GMT
పిక్‌ః అల్లూరి రామ్‌ గోపాల్‌ వర్మను చూశారా
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఈమద్య సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా సందడి చేస్తూనే ఉంటాడు. వివాదాస్పద విషయాలపై రెగ్యులర్ గా స్పందిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ తనకు సంబంధం ఉన్నా లేకున్నా ఆ విషయాల్లో స్పందిస్తూ ఉంటాడు. ఇక వర్మ మార్ఫింగ్ ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట ఎన్నో వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి రామ్‌ గోపాల్ వర్మ ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతూ అల్లూరి రామ్‌ గోపాల్‌ వర్మ అంటూ అభిమానులతో కీర్తించబడుతోంది.

రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్బంగా ఆర్ఆర్‌ఆర్ నుండి అల్లూరి సీతారామ రాజు లుక్ ను రిలీజ్‌ చేయడం జరిగింది. విల్లు ను ఎక్కు పెట్టిన రామ్‌ చరణ్‌ అద్బుతంగా ఉన్నాడంటూ అభిమానులు అభివర్ణిస్తున్నారు. కొందరు ఈ ఫొటోలో చరణ్‌ నిజంగా రాముడి మాదిరిగా ఉన్నాడని కూడా అంటున్నారు. ఆ ఫొటోను రామ్ గోపాల్‌ వర్మ ఫేస్ తో కొందరు ఔత్సాహికులు మార్ఫింగ్‌ చేసి నెట్టింట షేర్‌ చేశారు. అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అల్లూరి చేతిలో విల్లు ఉంటే వర్మ చేతిలో గన్ పెట్టారు. విల్లు తీసి బాణం పెట్టడంతో పాటు వర్మ ఫేస్ ను చక్కగా మార్ఫింగ్‌ చేయడంతో ఈ ఫొటో కాస్త నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.