Begin typing your search above and press return to search.

మాస్ మహారాజా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   5 Aug 2019 10:44 AM IST
మాస్ మహారాజా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా?
X
మాస్ మహారాజా రవితేజ సిల్వర్ స్క్రీన్ పై చేసే అల్లరి మామూలుగా ఉండదు. రియల్ లైఫ్ లో కూడా రవితేజ ఎంతో సరదాగా ఉంటారనే టాక్ ఉంది. కానీ మిగతా హీరోల లాగా తన ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలను పెద్దగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి ఎప్పుడో కానీ చెయ్యరు. కానీ నిన్న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రవితేజ తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరి ఫోటోలను షేర్ చేశారు. వారెవరో కాదు రవితేజ పిల్లలే.

రవితేజ తన ఇన్స్టా ఖాతా ద్వారా అందరికీ ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తన కూతురు మోక్షదతోనూ.. కొడుకు మహాధన్ తో ఉన్న రెండు ఫోటోలను పోస్ట్ చేశారు. ఫ్రెండ్స్ అనగానే సహజంగా 'గలగలగల గలగలగల గ్లాస్ మేట్సు' మాత్రమే అనుకుని చాలామంది ఊగిపోతుంటారు. కానీ మాస్ రాజా తనదైన స్టైల్ లో పిల్లల ఫోటోలు పోస్ట్ చేయడం ద్వారా తన పిల్లలు తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పేశారు.

సినిమాల విషయానికి వస్తే రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రవితేజ మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ మీదకు తీసుకెళ్ళే సన్నాహాల్లో ఉన్నాడట. ఆ రెండు సినిమాల్లో ఒకటి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం కాగా మరో సినిమా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతుందని సమాచారం.