Begin typing your search above and press return to search.

'జాను' డైరెక్టర్‌ రియల్‌ స్టోరీ తో సినిమా వచ్చింది తెలుసా?

By:  Tupaki Desk   |   12 Feb 2020 4:00 PM IST
జాను డైరెక్టర్‌ రియల్‌ స్టోరీ తో సినిమా వచ్చింది తెలుసా?
X
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘జాను’ చర్చ తెగ సాగుతోంది. తమిళ హిట్‌ మూవీ 96 ను ఏమాత్రం ఫీల్‌ మిస్‌ కాకుండా తెలుగు వారు కూడా మెచ్చే విధంగా ఫీల్‌ అయ్యే విధంగా దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశాడు. తమిళంలో 96కు డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌ కుమార్‌ తెలుగులో కూడా దర్శకత్వం వహించాడు. ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్‌ కుమార్‌ సీనియర్‌ దర్శకుడు కాదు.. ఎన్నో సూపర్‌ హిట్స్‌ ఇచ్చిన దర్శకుడు కూడా కాదు.

సినిమాటోగ్రాఫర్‌ అయిన ప్రేమ్‌ కుమార్‌ దర్శకుడిగా మారి 96ను తెరకెక్కించాడు. ఒక సీనియర్‌ ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌ తరహా లో ప్రేమ్‌ కుమార్‌ 96 ను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ దర్శకుడి గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికర విషయం సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతుంది. ఇతగాడి రియల్‌ లైఫ్‌ సంఘటనల ఆధారంగా తమిళం లో ఒక సినిమా వచ్చింది. దాన్ని తెలుగులో కూడా రీమేక్‌ చేయడం జరిగింది.

ప్రేమ్‌ కుమార్‌ రియల్‌ లైఫ్‌ లో పెళ్లి అనేది చాలా నాటకీయ పరిణామాల మద్య సాగిందట. పెళ్లికి కొద్ది రోజుల ముందు ప్రేమ్‌ కుమార్‌ క్రికెట్‌ ఆడాడు. ఆ సమయంలో బంతి తలకు బలంగా తగలడం తో అతడి జ్ఞాపక శక్తి కోల్పోయాడు. గత గతంను గుర్తు తెచ్చుకోలేక పోయాడట. స్నేహితులు ఏదో విధంగా మ్యానేజ్‌ చేసి పెళ్లి చేశారు.

పెళ్లి సమయంలో ప్రేమ్‌ కుమార్‌ స్నేహితులు చాలా కష్టపడ్డట్లుగా చెబుతూ ఉంటారు. పెళ్లి అయిన తర్వాత రోజు అతడికి తన గతం అంతా గుర్తుకు వచ్చింది. ప్రేమ్‌ కుమార్‌ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా తమిళంలో నడువుల కొంజెం పక్కత్త కానోయ్‌ అనే టైటిల్‌ తో విజయ్‌ సేతుపతి హీరో గా సినిమా తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

వినోదాత్మకంగా రూపొందిన ఆ చిత్రాన్ని తెలుగులో పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌ అనే టైటిల్‌ తో శ్రీనివాస్‌ హీరోగా రీమేక్‌ అయ్యింది. నడువుల కొంజెం పక్కత్త కానోయ్‌ చిత్రం పూర్తి అయిన తర్వాత ఇది సినిమాటోగ్రాఫర్‌ ప్రేమ్‌ కుమార్‌ లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది అంటూ టైటిల్‌ కార్డ్‌ వేయడం జరిగింది. అదన్నమాట ‘జాను’ డైరెక్టర్‌ రియల్‌ లైఫ్‌ సినిమా కథ.