Begin typing your search above and press return to search.

పవన్‌ ఫ్యాన్స్‌ అనుకుంటున్నది జరిగేనా?

By:  Tupaki Desk   |   12 Sept 2020 9:45 AM IST
పవన్‌ ఫ్యాన్స్‌ అనుకుంటున్నది జరిగేనా?
X
పవన్‌ కళ్యాణ్‌ ఈ ఏడాది వకీల్‌ సాబ్‌.. విరూపాక్ష సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని కరోనా కారణంగా మొత్తం తలకిందులు అయ్యింది. ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్‌ లేకపోవడంతో రెండు సినిమాల్లో కనీసం ఒక్కటి అయినా విడుదలకు నోచుకునే అవకాశం కనిపించడం లేదు. కరోనా కారణంగా పవన్ కమిట్‌ అయిన సినిమాల్లో ఏదైనా క్యాన్సిల్‌ అయ్యే అవకాశం ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని ఇటీవల పవన్‌ బర్త్‌ డే రోజు మూడు సినిమాలకు తోడుగా మరో సినిమా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా రాబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.

పవన్‌ కళ్యాణ్‌ ఖాతాలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆ నాలుగు సినిమాల్లో ఖచ్చితంగా మూడు సినిమాలు 2021లో వస్తాయని చాలా నమ్మకంగా పవన్‌ ఫ్యాన్స్‌ నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్‌ వరకు వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ పూర్తి అయ్యి సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లోనే క్రిష్‌ మూవీ 'విరూపాక్ష' పట్టాలెక్కబోతుంది. సమ్మర్‌ వరకు విరూపాక్ష సినిమాను పూర్తి చేసి ఆ వెంటనే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమాను పవన్‌ చేయబోతున్నాడు.

పవన్‌ ఈమద్య కాలంలో ప్రతి సినిమాకు కూడా మూడు నెలల కంటే ఎక్కువ సమయం తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చాడు. కనుక హరీష్‌ శంకర్‌ కూడా వచ్చే ఏడాది చివరి వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. పవన్‌ వచ్చే ఏడాదిలో మూడు సినిమాలతో వస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఫ్యాన్స్‌ కు పండుగే పండగ.