Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' ముందుగా బాలయ్య దగ్గరకు వెళ్లిందా..?

By:  Tupaki Desk   |   15 May 2021 9:00 AM IST
వకీల్ సాబ్ ముందుగా బాలయ్య దగ్గరకు వెళ్లిందా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ 'వకీల్ సాబ్' సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. ఇది బాలీవుడ్ మూవీ 'పింక్' చిత్రానికి రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. కోవిడ్ నేపథ్యంలో వసూళ్ళు తగ్గినప్పటికీ ఫ్రాఫిటబుల్ ప్రాజెక్ట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికపై ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే 'పింక్' తెలుగు రీమేక్ లో హీరోగా ముందు అనుకున్నది పవన్ కళ్యాణ్ ని కాదు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'పింక్' చిత్రాన్ని తెలుగులో తీయాలని భావించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ముందుగా నందమూరి బాలకృష్ణ ను సంప్రదించారట. అప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ సినిమాని తమిళ్ లో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో బాలయ్య అయితే బాగుంటుందని నిర్మాత అనుకున్నారట. కానీ బాలకృష్ణ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట. ఈ క్రమంలో దిల్ రాజు 'నెర్కొండ పార్వై' చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దృష్టికి వెళ్లడం.. అప్పటికే రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న పవన్ కు దాన్ని చూపించడం.. హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఒకవేళ బాలకృష్ణ నల్లకోటు ధరించడానికి రెడీ అయితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండేదో మరి.