Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ ఈ ఇద్దరు స్టార్ హీరోలను బాలన్స్ చేశాడా..??
By: Tupaki Desk | 3 April 2021 3:22 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు బాగానే రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి అయ్యప్పనుమ్ కోషియం. గతేడాది మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రీమేక్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా సిద్ధం అవుతోంది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ తో రానా నటిస్తున్నాడు. ఒక పోలీస్, ఒక మిల్ట్రీ హవాల్దారుకు మధ్య రగిలిన ఇగోల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే ఈ భారీ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరూ కూడా ఓ రేంజిలో తలపడనున్నారు. పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ అనేసరికి ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.
తాజాగా 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ గురించి ఆ సినిమా సంగీతదర్శకుడు పలు క్రేజీ విషయాలను షేర్ చేసుకున్నాడు. తమన్ మాట్లాడుతూ.. ఈ తెలుగు రీమేక్ సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ చూడవచ్చు. ఈ సినిమాలో త్రివిక్రమ్ ఇద్దరు స్టార్స్ ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు. నిజానికి ఈ సినిమా విషయంలో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అవుతుందని నమ్మకం ఉంది' అని చెప్పాడు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఐతే ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఉండగా అవన్నీ కంప్లీట్ చేసినట్లు తెలిపాడు. ఒక్కో పాటను ఒక్కో లిరిక్ రైటర్ రాసారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మతో పాటు డైలాగ్స్ కూడా అందించాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.