Begin typing your search above and press return to search.

ఈ టాలీవుడ్ హీరో మరో భారీ మూవీని ఓకే చేశాడా..??

By:  Tupaki Desk   |   22 Dec 2020 2:30 PM IST
ఈ టాలీవుడ్ హీరో మరో భారీ మూవీని ఓకే చేశాడా..??
X
టాలీవుడ్ టాల్ హీరో దగ్గుబాటి రానా.. హీరోగా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమాను కంప్లీట్ చేస్తూ విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. అయితే రానా హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం "అరణ్య". ప్రభు సాలొమోన్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ బాషలలో ఒకేసారి విడుదల కానుంది. 2021 సంక్రాంతి బరిలో విడుదల కానున్నట్లు తెలిసిందే. అదేగాక విరాటపర్వం సినిమా కూడా తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన విరాటపర్వం పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఇదివరకే బాహుబలితో దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్న రానా.. హౌస్ ఫుల్-4 సినిమాతో బాలీవుడ్ లో మరోసారి తన సత్తా చాటే ప్రయత్నం చేసాడు. ఆ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం రానా గుత్తుచప్పుడు కాకుండా మరో భారీ పాన్ ఇండియా సినిమాకి ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. మరి ఆ ప్రాజెక్ట్ ఏంటి..? అనుకుంటుండగా డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశిప'నే అయ్యుంటుంది అని అంతా భావిస్తున్నారు. అసలు రానా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఓకే చేశాడా.. లేక ఇవన్నీ వదంతులేనా అనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ తో కలిసి 'అయ్యప్పన్ కోషియం' రీమేక్ లో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన సంగతి విదితమే. షూటింగ్ ప్రారంభం కానున్న ఆ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. చూడాలి మరి ఎలాంటి ప్రాజెక్ట్స్ తో అలరిస్తాడో..!