Begin typing your search above and press return to search.

కప్పేలా రీమేక్ లో దొరసాని ఛాన్స్ కొట్టిందా..??

By:  Tupaki Desk   |   3 March 2021 10:35 AM GMT
కప్పేలా రీమేక్ లో దొరసాని ఛాన్స్ కొట్టిందా..??
X
మలయాళం నుండి తెలుగులోకి చాలా సినిమాలు రీమేక్ అవుతున్నాయి. హిట్టు కొట్టిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. సరిగ్గా కరోనా ముందు అంటే గతేడాది ఇదే సమయంలో మలయాళంలో కప్పేలా అనే సినిమా విడుదలైంది. సినిమా సూపర్ హిట్ టాక్ అందుకొని కేరళ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది కప్పేలా. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అన్నా బెన్, శ్రీ‌నాథ్ భ‌సి, రోష‌న్ మాథ్యూ ప్ర‌ధాన పాత్ర‌లలో నటించి మెప్పించారు. ఈ సినిమాను మ‌హ్మ‌ద్ ముస్తాఫా తెరకెక్కించాడు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఓవైపు ప్రేక్షకులతో పాటు విమర్శకులను ప్రశంసలు అందుకుంది. ఓటిటి పరంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సూపర్ హిట్ అయిన కప్పేలా రీమేక్ పనులు టాలీవుడ్ లో జరుగుతున్నాయి.

ప్ర‌ముఖ సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించ‌నున్నాడు. అయితే తాజాగా సినిమాలో హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఈ రీమేక్ మూవీలో హీరోయిన్ గా హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక ఓకే అయినట్లు టాక్. ఇప్ప‌టికే ఈ సినిమా గురించి శివాత్మికతో మేకర్స్ చర్చలు జరిపారట. యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర కావడంతో శివాత్మిక ఈ రీమేక్ లో న‌టించేందుకు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలోని శ్రీ‌నాథ్, రోష‌న్ పాత్ర‌ల్లో విశ్వ‌క్ సేన్, న‌వీన్ చంద్ర న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇక ప్రస్తుతం శివాత్మిక కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండా సినిమాలో నటిస్తోంది.