Begin typing your search above and press return to search.

ధ‌ర్మ సందేహం: ఓటీటీ సెక్ష‌న్ థియేట‌ర్ల‌కు రారా?

By:  Tupaki Desk   |   17 May 2020 12:00 AM IST
ధ‌ర్మ సందేహం: ఓటీటీ సెక్ష‌న్ థియేట‌ర్ల‌కు రారా?
X
క‌రోనా బోలెడ‌న్ని పాఠాలు నేర్పిస్తోంది. మారిన కాలాన్ని బ‌ట్టి భ‌విష్య‌త్ లో ట్రెండ్ ఎలా ఉండాలో కూడా క‌రోనా వైర‌స్ నిర్ధేశించింది. ముఖ్యంగా వినోద ప‌రిశ్ర‌మ‌లో నిత్యనూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఇది దోహ‌దం చేస్తోంది. ఇన్నాళ్లు థియేట‌ర్ కి వెళితేనే వినోదం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ-డిజిట‌ల్- యూట్యూబ్ వేదిక‌లు స‌రైన ఆప్ష‌న్ అన్న‌ది క‌రోనా వ‌ల్ల ప్రూవ్ అయ్యింది. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌వ‌చించినట్టు.. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి చెప్పిన‌ట్టు.. డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) కి అల‌వాటు ప‌డితే త‌ప్పేమీ కాద‌ని ఆనాడు విన‌ని వాళ్లు క‌రోనా చెబితే వినాల్సిన ప‌రిస్థితి.

అదంతా స‌రే కానీ.. ప్ర‌స్తుతం ఓటీటీ కంపెనీల‌న్నీ భారీగా వ్యూవ‌ర్ షిప్ ని పెంచుకున్నాయి. ఇప్ప‌టికే నెట్ ఫ్లిక్స్ ఇండియాలో వ్యూవ‌ర్స్ ని పెంచుకున్న నంబ‌ర్ వ‌న్ ఓటీటీగా పాపుల‌రైంది. ఆ త‌ర్వాత హాట్ స్టార్- డిస్నీ అల‌యెన్స్ రెండో స్థానంలో నిలిచాయి. ఇక మూడో స్థానంలో అమెజాన్ ఉంది. జీ5 భారీగానే వ్యూవ‌ర్స్ ని పెంచుకుంద‌ట‌. ఈ లాక్ డౌన్ సీజ‌న్ ని క్యాష్ చేసుకున్న టాప్ 4 ఓటీటీలు ఇవేన‌‌న్న ప్ర‌చారం సాగుతోంది. అయితే వీటివ‌ల్ల మునుముందు థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌కు వాటిల్లే ముప్పు ఎలా ఉంటుందోన‌న్న ఆందోళ‌న ఎగ్జిబిట‌ర్ రంగంలో నెల‌కొంది. జ‌నం థియేట‌ర్ల‌కు రాక‌పోతే అన్న ఆలోచ‌నే ప‌ట్టి కుదిపేస్తోంది.

అయితే దీనిపై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. ముఖ్యంగా ఎగ్జిబిట‌ర్లు మాత్రం ఇంకా జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తార‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మొన్న‌టికి మొన్న మెగాస్టార్ చిరంజీవి సైతం ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితే అన్నీ మామూలుగానే ఉంటాయ‌ని అన్నారు. ``ఇక్కడ ఏది నష్టపోదు...! ఓటిటి లో చూసే వాళ్ళు అక్క‌డే చూస్తారు... థియేటర్ కి వచ్చేవాళ్లు థియేట‌ర్ల‌కే వ‌స్తారు!`` అన్న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు చాలా మంది. ఓటీటీ స‌బ్ స్క్రిప్ష‌న్లు పొందిన‌ వాళ్లు కొంత‌ వ‌ర‌కూ థియేట‌ర్ల‌ను అవాయిడ్ చేసేందుకు ఆస్కారం లేక‌పోలేదు. అలాగ‌ని వారు థియేట‌ర్ల‌ను పూర్తిగా వ‌దిలేస్తార‌ని చెప్ప‌లేం.

ఇక ఓటీటీ వ‌ల్ల మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల కంటే సింగిల్ స్క్రీన్స్ కే ముప్పు ఉంటుంద‌న్న మ‌రో అంచ‌నా వెలువ‌డింది. అయితే ఇవ‌న్నీ ఇప్ప‌టికి ఊహాగానాలు మాత్ర‌మే. ఏడాది పాటు ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్థ‌మై పోయింది. ఆ త‌ర్వాతా థియేట‌ర్ల సీను ఎలా ఉంటుంది? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక్కోసారి పండితుల దూర‌పు చూపు కూడా ఫెయిల‌వుతుంటుంది మ‌రి.