Begin typing your search above and press return to search.
మెగాహీరో లుక్కు డ్యూయెల్ రోల్ పై పడిందా..??
By: Tupaki Desk | 21 April 2021 9:00 AM ISTటాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రూపుదిద్ధుకుంటున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అయితే సైలెంట్ గా కుదిరిన ఈ కాంబినేషన్ గత కొన్నిరోజులుగా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటంటే.. రాంచరణ్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో యంగ్ హీరో క్యారెక్టర్ తో పాటు చరణ్ అరవై ఏళ్ల వృద్ధుడి పాత్రలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు టాక్. ఇదివరకు రాంచరణ్ నాయక్ సినిమాలో డ్యూయెల్ రోల్ పోషించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయాన్ని నమోదు చేసింది.
ఆ సినిమాలో రెండు కూడా యంగ్ రోల్స్. కానీ ఈ సినిమాలో చరణ్ వృద్ధుడిగా నటించనున్నాడని అంటున్నారు. ఒకవేళ ఇదేగనక నిజమైతే.. ఇది రాంచరణ్ కెరీర్ లో రెండోసారి డ్యూయెల్ రోల్ సినిమా అవుతుంది. ప్రస్తుతం దర్శకుడు నిర్మాతలు ఈ విషయం పై చర్చలు జరుపుతున్నారట. మరి శంకర్ కూడా ఇదివరకు డ్యూయెల్ రోల్స్ సినిమాలు చేసాడు. మరి దిల్ రాజు నిర్మాణంలో 50వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాకు ఫస్ట్ టైం హైయెస్ట్ బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు శంకర్ సినిమాలలో హీరోయిన్లకు ప్రత్యేకత ఉంది. మరి ఈసారి రాంచరణ్ కోసం అటు బాలీవుడ్ వైపు లుక్కేసినట్లు సమాచారం. ప్రస్తుతం పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ తో పాటు ఓ కొరియన్ భామ పేరు కూడా లిస్టులో ఉందని టాక్. చూడాలి మరి రాంచరణ్ కు ఈ సినిమా ఎంత స్పెషల్ కాబోతుందో..!