Begin typing your search above and press return to search.

'ఐకాన్' మళ్ళీ కనిపించనున్నాడా..?

By:  Tupaki Desk   |   12 April 2021 6:30 AM GMT
ఐకాన్ మళ్ళీ కనిపించనున్నాడా..?
X
'వకీల్ సాబ్' సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు దర్శకుడు వేణు శ్రీరామ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీని ఆయన హ్యాండిల్ చేసిన విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రీరామ్ వేణు.. తదుపరి ప్రాజెక్ట్ ఎంటనేది ఆసక్తికరంగా మారింది. పదేళ్ళ కెరీర్ లో కేవలం మూడు సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేసిన వేణు.. నెక్స్ట్ మూవీని వీలైనంత త్వరగా సెట్ చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్పట్లో అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసిన 'ఐకాన్ - కనబడుటలేదు' ప్రాజెక్ట్ మళ్ళీ లైన్ లోకి రాబోతోందని వార్తలు వస్తున్నాయి.

'ఐకాన్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాల్సి ఉంది. అయితే బన్నీ దీనిని పక్కన పెట్టి 'అల వైకుంఠపురంలో' సినిమాని పూర్తి చేసి.. సుకుమార్ తో 'పుష్ప' మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అదే క్రమంలో వేణు శ్రీరామ్ 'వకీల్ సాబ్' పనుల్లో పడిపోయారు. ఇక కొరటాల శివతో అల్లు అర్జున్ ఓ మూవీ ప్రకటించడంతో అందరూ 'ఐకాన్' ని మర్చిపోయారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారడంతో మళ్ళీ 'ఐకాన్' కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 'పుష్ప' సినిమా లేట్ అవుతుండటంతో కొరటాల.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అంటే బన్నీ 'పుష్ప' షూటింగ్ పూర్తి చేశాక కొరటాల కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉన్న 'ఐకాన్' వైపు అడుగులు పడుతున్నాయని టాక్.

'వకీల్ సాబ్' తో సక్సెస్ జోష్ లో ఉన్న వేణు శ్రీరామ్ తో ఇప్పటికే 'ఐకాన్' సినిమా గురించి చర్చలు కూడా మొదలయ్యాయట. ఐకాన్ స్టార్ ట్యాగ్ లైన్ తో రాబోతున్న అల్లు అర్జున్.. 'ఐకాన్' అనే టైటిల్ తో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐకాన్ గురించి మాట్లాడిన డైరెక్టర్ శ్రీరామ్ వేణు దాని గురించి క్లారిటీ లేదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు బ్యానర్ లో బన్నీతో సినిమా షురూ అవుతుందో లేదో చూడాలి.