Begin typing your search above and press return to search.

స్టైలిష్ స్టార్ చూపు మళ్లీ ఐకాన్ పై పడిందా..??

By:  Tupaki Desk   |   23 March 2021 11:30 PM GMT
స్టైలిష్ స్టార్ చూపు మళ్లీ ఐకాన్ పై పడిందా..??
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే మేకర్స్ విడుదల తేదీ ప్రకటించి ట్రీట్ ఇచ్చేసారు. మొన్నటి వరకు గోదావరి జిల్లాల్లోని మారేడుమిల్లి అడవులలో భారీ షెడ్యూల్ పూర్తి చేశారు మేకర్స్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీడ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. సుకుమార్ తో బన్నీకి మూడో సినిమా ఇది. ఈ ఏడాది ఆగష్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉండగా.. బన్నీ తదుపరి సినిమాల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. పుష్ప తర్వాత బన్నీ.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పొలిటికల్ మూవీ చేయనున్నట్లు టాక్. ఇప్పటికే వీరి కాంబినేషన్ అధికారికంగా సెట్ అయిపోయింది. ఆచార్య సినిమా తర్వాత కొరటాల బన్నీ స్క్రిప్ట్ పై దృష్టి పెట్టనున్నాడు. అయితే తాజాగా బన్నీ - వేణు శ్రీరామ్ కాంబినేషన్ మూవీ ఐకాన్ తెరమీదకి వచ్చింది. అల్లు అర్జున్ కు ఇదివరకు ఐకాన్ కథ వినిపించి ఓకే అనిపించుకున్నాడు వేణు. తీరా మొదలవుతుంది అనుకున్న టైంలో సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాతో తన స్టామినా చూపించే ప్రయత్నంలో ఉన్నాడు డైరెక్టర్. అల్లు అర్జున్ తో మళ్లీ ఐకాన్ గురించి చర్చలు జరిపేందుకు నిర్మాత దిల్ రాజు సిద్ధంగా ఉన్నాడట. ఐకాన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు వేణు. మరి చూడాలి వకీల్ సాబ్ తర్వాత బన్నీ నుండి కాల్ వస్తుందేమో!