Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్ - పవన్' మధ్య ఆ సీన్ నిజంగా జరిగిందా..??

By:  Tupaki Desk   |   14 April 2021 6:29 PM IST
ఎన్టీఆర్ - పవన్ మధ్య ఆ సీన్ నిజంగా జరిగిందా..??
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫస్ట్ డే నుండి వకీల్ సాబ్ అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పవన్ కళ్యాణ్ ను కొనియాడుతున్నారు. మంచి సందేశాత్మక సినిమాతో వచ్చినందుకు వకీల్ సాబ్ బృందానికి ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను కళ్లకు కట్టినట్టు చూపించడంతో పాటు ఆడపిల్లలు ఎంత బలంగా ఉండాలో కూడా చూపించడం చాలా బాగుందని పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ప్రస్తుతం వకీల్ సాబ్ విషయంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ బయటపెట్టిన విషయంపై ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్దచర్చే నడుస్తుంది. వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా లాయర్ నందగా నటించిన ప్రకాష్ రాజ్.. ఓ ఇంటర్వ్యూలో.. "వకీల్ సినిమాను చూసిన ఎన్టీఆర్ సినిమా బాగా నచ్చి పవన్ కళ్యాణ్ ను హగ్ చేసుకున్నాడు" అని ప్రకాష్ రాజ్ తెలిపాడట. మరి ఇంతవరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వకీల్ సాబ్ గురించి స్పందించలేదు. కనీసం ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేయలేదు. ఓకే సీక్రెట్ గానే దాచాడని అనుకుంటే ప్రకాష్ రాజ్ బయటపెట్టేసాడని అంటున్నారు. చర్చలకు దారితీస్తున్న ఈ విషయంపై ప్రేక్షకులలో, నేటిజన్లలో.. అసలు ఎన్టీఆర్ వకీల్ సాబ్ చూసాడా.. చూస్తే ఈ హగ్ సీన్ ఎక్కడ జరిగింది? అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి అసలు నిజం ఎప్పుడు బయటికి వస్తుందో..!