Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్'లో ఆ బ్యూటీ రోల్ పొడిగించారా..?

By:  Tupaki Desk   |   19 March 2021 11:10 AM GMT
ఆర్.ఆర్.ఆర్లో ఆ బ్యూటీ రోల్ పొడిగించారా..?
X
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ లో చరణ్ కు జోడీగా అలియా కనిపించనుంది. ఈ ఫిక్షనల్ పీరియాడికల్ మూవీలో అల్లూరి సీతారామరాజు కోసం ఎదురు చూసే సీత పాత్రలో ఆమె నటిస్తోంది. ఇటీవలే విడుదలైన సీత ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. త్వరలోనే రామ్ చరణ్ - ఆలియా భట్ కాంబినేషన్ లో ఓ సాంగ్ షూట్ చేయడానికి రాజమౌళి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

నిజానికి ముందుగా అనుకున్న ప్రకారం అలియా ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసిందట. అయితే బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని జక్కన్న ఇప్పుడు ఆమె పాత్రని ఇంకాస్త పొడిగించారని టాక్ వినిపిస్తోంది. అందుకే వచ్చే నెలలో ఒక సాంగ్ తో పాటుగా మరికొన్ని సన్నివేశాలను కూడా అలియాపై చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఆలియాకు బాలీవుడ్ లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ మార్కెట్ ని బట్టి చూస్తే అజయ్ దేవగన్ తో పాటు అలియా ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజమౌళి కూడా ఇదే ఆలోచించి ఉంటారు. ఇకపోతే 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ మే చివరి నాటికి పూర్తవుతుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.