Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   28 March 2022 8:30 AM GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టేనా?
X
కెరీర్లో ఒక్కసారైనా ఊర మాస్ మూవీ చేయాల‌ని ప్ర‌తీ హీరో కోరుకుంటారు. అలాగే హై వోల్టేజ్ మాసీవ్ యాక్ష‌న్ సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించే డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తో ఒక్క సినిమా అయినా స‌రే చేయాల‌ని మెగా స్టార్ చిరంజీవి నుంచి ప్ర‌తీ స్టార్ హీరో ఆస‌క్తిని చూపిస్తుంటారు. కార‌ణం సినిమా ఫ‌లితం, క‌థ‌, క‌థ‌నాలు ఎలా వున్నా బోయ‌పాటి శ్రీ‌ను హీరో పాత్ర‌ని డిజైన్ చేసే తీరు, వెండితెర‌పై ఆ పాత్రని ప‌వ‌ర్ ఫుల్ గా ఆవిష్క‌రించే తీరు చాలా మంది హీరోల‌ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది.

అందుకే స్టార్ హీరోల్లో చాలా మంది బోయ‌పాటితో సినిమా చేయాల‌ని భావిస్తుంటారు. ఈ విష‌యాన్ని `రేసుగుర్రం` మూవీ రిలీజ్ స‌మ‌యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వ‌యంగా వెల్ల‌డించారు కూడా. ఆ త‌రువాత `స‌రైనోడు` చిత్రాన్ని బోయ‌పాటి శ్రీ‌నుతో బ‌న్నీ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇదే త‌ర‌హా ఆస‌క్తితో మ‌రో స్టార్ హీరో బోయ‌పాటి శ్రీ‌ను తో హై వోల్టేజ్ మాస్ యాక్ష‌న్ మూవీని చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.

ఆయ‌నే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. త్వ‌ర‌లో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఓ మాస్ మ‌సాలా యాక్ష‌న్ మూవీ రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `అఖండ‌` చిత్రంతో బోయ‌పాటి శ్రీ‌ను మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి బాల‌కృష్ణ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన మూవీగా రికార్డు సాధించింది. ఈ మూవీ త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను ఉస్తాద్ రామ్ తో ఓ భారీ సినిమా చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ భారీ చిత్రం ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ మూవీతో పాటు అల్లు అర్జున్ తోనూ బోయ‌పాటి ఓ సినిమా చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే బోయ‌పాటి శ్రీ‌ను త్వ‌ర‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో ఓ భారీ యాక్ష‌న్ మూవీని చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త కొంత కాలంగా మ‌హేష్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్న బోయపాటి మొత్తానికి ఓ భారీ ప్రాజెక్ట్ ని పైన‌ల్ చేసుకున్నార‌ని, దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌య‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌హేష్ నిజంగానే బోయ‌పాటికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ మూవీ త‌రువాత త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఆ త‌రువాత‌ జ‌క్క‌న్న తో పాన్ ఇండియా మూవీని చేయ‌బోతున్న మ‌హేష్ దీని కోసం ఎంత కాద‌న్నా దాదాపు రెండేళ్ల పాటు రాజ‌మౌళికి డేట్స్ ఇవ్వాల్సిందే. మ‌రి బోయ‌పాటి శ్రీ‌ను ప్రాజెక్ట్ కోసం మ‌హేష్ టైమ్ ఎలా కేటాయిస్తాడు? ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.