Begin typing your search above and press return to search.

విడాకుల త‌ర్వాత గ్లామ‌ర్ డోస్ పెంచేసిందా?

By:  Tupaki Desk   |   22 April 2022 9:22 AM GMT
విడాకుల త‌ర్వాత గ్లామ‌ర్ డోస్ పెంచేసిందా?
X
వృత్తిప‌ర‌మైన వ్య‌వ‌హారాలు స‌రే కానీ..ఒక‌రి వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల్లో ఇత‌రులు త‌ల‌దూర్చ‌డం స‌రికాదు. లైఫ్ లో కొన్ని ఒడిదుడుకులు విభేధాలు మ‌న‌స్ప‌ర్థ‌లు ఇవ‌న్నీ ఈరోజుల్లో చాలా కామ‌న్ గా మారాయి. ముఖ్యంగా గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో జంట‌లు విడిపోవ‌డం రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌దే. అన్ని బాండింగ్స్ ఒకేలా లేవు అని నిరూప‌ణ అయ్యింది. ఇక ఇంత‌కుముందే అందాల స‌మంత కూడా త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన‌ట్టుగా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

అయితే ఆ త‌ర్వాత స‌మంత‌పై ట్రోలింగ్ గురించి తెలిసిన‌దే. ఇక విడాకుల‌ త‌రవాత స‌మంత బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ అయిపోయింది. అంతేకాదు పుష్ప‌లో ఊ అంటావా ఐట‌మ్ నంబ‌ర్ తో స‌మంత పాపులారిటీ అమాంతం పాన్ ఇండియా రేంజుకు చేరుకుంది. అదే స‌మ‌యంలో సామ్ అందాల ఆర‌బోత అంతే ఇదిగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. నిజానికి విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం స‌మంత కావాల‌నే గ్లామ‌ర్ డోస్ పెంచేసిందా? అంటే.. దానికి స‌మాధానం ఆడియెన్ నే అడ‌గాలి.

అయితే ఇక్క‌డ వేరే కోణం ఆలోచించాలి. గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో న‌టీమ‌ణులు ఎలా క‌నిపిస్తే ఆడియెన్ కి చేరువ అవుతారో వారికి తెలుసు. పెళ్ల‌యిన క‌థానాయిక అని స‌ప‌రేట్ గా ఆడియెన్ చూడ‌రు. అందుకు త‌గ్గ‌ట్టే స‌మంత ప్ర‌వ‌ర్త‌న కూడా ఉంది. తాను ఎంపిక చేసుకున్న పాత్ర లేదా ఐట‌మ్ నంబ‌ర్ లేదా సినిమాని బ‌ట్టి త‌న గ్లామ‌ర్ డోస్ ఎలివేష‌న్ ఉంటుంద‌న్న‌మాట‌.

తాజాగా స‌మంత న‌టించిన త‌మిళ చిత్రం 'కాతువాకుల‌..' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో విజ‌య్ సేతుప‌తి - న‌య‌న‌తార జంట కాగా స‌మంత పాత్ర కూడా అంతే క్యూరియాసిటీ పెంచుతోంది. అయితే ఈ పాత్ర ఆద్యంతం గ్లామ‌ర్ ఎలివేష‌న్ తో కూడుకున్న‌ద‌ని ఇప్ప‌టికే రిలీజైన ప్రోమోలు టీజ‌ర్ లు వగైరా నిరూపించాయి. న‌యన్ - సామ్ అక్కా చెల్లెళ్లుగా క‌నిపిస్తార‌ని ఆ ఇద్ద‌రి న‌డుమా సేతుప‌తి ఎలా వేగాడో తెర‌పై చూపిస్తున్నార‌ని కూడా క‌థను లీక్ చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి డిప్పం డ‌ప్పం అనే పాట ఒక‌టి రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా సేతుప‌తి- సామ్‌ల మీద తీసిన క్ల‌బ్ సాంగ్. ప‌బ్బులో స‌మంత .. సేతుప‌తి న‌డుమ ఎమోష‌న్స్ ఏమిట‌న్న‌ది క్లియ‌ర్ క‌ట్ గా చూపించారు. ఇక స‌మంత ప‌బ్బులో అల్ట్రా మోడ్ర‌న్ గా గ్లామ‌ర‌స్ లుక్ తో క‌నిపిస్తోంది. నిజానికి ప‌బ్బులో పాట అంటే చీర క‌ట్టి తీయాల‌నేమీ లేదు. మోడ్ర‌న్ గాళ్స్ ప‌బ్ ఎంట్రీని ఆవిష్క‌రించాల్సి ఉంటుంది.

విఘ్నేష్ శివ‌న్ అదే తీరుగా ఈ పాట‌ను తెర‌కెక్కించారు. ఇక‌పోతే ఈ సాంగ్ ఆద్యంతం పబ్బులో స‌మంత ఎమోష‌న్స్ లవ్ ఫీలింగ్స్ సామ్ తో సేతుప‌తి వ్య‌థ ఏమిట‌న్న‌ది పూర్తి సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఈ చిత్రం ఆచార్య కు పోటీగా ఈ నెల 28న రిలీజ‌వుతోంది. అయితే త‌మిళంలో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం స‌మంత సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ గా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. స‌మంత గ్లామ‌ర్ డోస్ అతిగా ఉందా లేదా? అన్న‌ది ఆడియెన్ మూవీ చూశాక‌ డిసైడ్ చేస్తారు.