Begin typing your search above and press return to search.

నిఖిల్ కు కౌంట‌ర్ ఇచ్చిందా?

By:  Tupaki Desk   |   1 Aug 2022 12:32 PM GMT
నిఖిల్ కు కౌంట‌ర్ ఇచ్చిందా?
X
టాలెంటెడ్ యంగ్ హీరో నిఖిల్ న‌టించిన లేటెస్ట్ సూప‌ర్ నేచుర‌ల్ మిస్టిక్ థ్రిల్ల‌ర్ `కార్తికేయ 2`. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ ల‌పై అభిషేక్ అగ‌ర్వాల్‌, టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించారు. 2014లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ ఫిల్మ్‌ `కార్తికేయ‌` కు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ గా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీని విడుద‌ల చేస్తున్నారు.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టించ‌గా కీల‌క పాత్ర‌ల్లో బాలీవుడ్ పాపుల‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. జూలై 22న విడుద‌ల కావాల్సిన ఈ మూవీ అనివార్య‌కార‌ణాల వ‌ల్ల పోస్ట్ పోన్ అయింది. తాజాగా ఈ మూవీని ఆగ‌స్టు 12న విడుద‌ల చేస్తున్నామంటూ చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. చాలా వ‌ర‌కు అడ్డంకులు ఎదురొచ్చినా ఈ మూవీని ఎట్ట‌ప‌రిస్థితుల్లో ఆగ‌స్టు 12నే విడుద‌ల చేయాల‌ని ప్రొడ్యూస‌ర్స్ స్ట్రాంగ్ గా ఫిక్స‌య్యారు.

దీంతో ప్ర‌మోష‌న్స్ ని మేక‌ర్స్ భారీ స్థాయిలో ప్రారంభించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ లు సినిమా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది, దీంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ క్రియేట్ అయింది. తొలి భాగం సూప‌ర్ హిట్ కావ‌డం, పార్ట్ 2 శ్రీ‌కృష్ణుడికి సంబంధించిన ర‌హ‌స్యాల నేప‌థ్యంలో సాగ‌నుంద‌ని తెలియ‌డంతో ప్రేక్ష‌కులు ఈ మూవీపై ప్ర‌త్యేక ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నిఖిల్ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌రమైన విష‌యాల్ని వెల్ల‌డించారు.

అంతే కాకుండా హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ అని, అయితే ప్ర‌మోష‌న్స్ కి మాత్రం రాదంటూ అనుప‌మ‌పై న‌వ్వుతూనే సెటైర్లు వేశాడు. తాజాగా అనుపమ‌ దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది.

ఇండైరెక్ట్ గా నిఖిల్ అన్న మాట‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చినంత ప‌ని చేసింది. `కార్తికేయ 2` ప్ర‌మోష‌న్స్ లో నేను ఎందుకు పాల్గొన‌లేక‌పోతున్నానో క్లారిటీ ఇవ్వాల‌నుకుంటున్నాను. మ‌రో రెండు సినిమాల్లో న‌టిస్తూ డే అండ్ నైట్ షూటింగ్స్ లో పాల్గోంటున్నాను. ఇత‌ర ఆర్టిస్ట్ ల‌తో క‌లిసి చేయాల్సిన కాంబినేష‌న్ సీన్స్ వున్నందున డేట్స్ గతంలోనే ఇచ్చినందునరాలేక‌పోతున్నాను.

అంతే కాకుండా `కార్తికేయ‌2` రిలీజ్ డేట్ లు కూడా మారాయి. ఏదిఏమైనా నా ఇబ్బందుల్ని అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డిన టీమ్ కి ముఖ్యంగా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో క‌ష్ట‌ప‌డుతున్న నిఖిల్ గారికి ప్ర‌త్యేక ధ‌న్యావాదాల అంటూ అనుప‌మ చ‌మ‌త్కిరించ‌డం విశేషం. నిఖిల్ సెటైర్ కి అనుప‌మ ఇచ్చిన కౌంట‌ర్ గా దీన్ని అంతా భావిస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో అనుప‌మ షేర్ చేసిన పోస్ట్ వైర‌ల్ గా మారింది.