Begin typing your search above and press return to search.

షారూఖ్ - అట్లీ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టారా?

By:  Tupaki Desk   |   7 Jun 2022 4:02 AM GMT
షారూఖ్ - అట్లీ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టారా?
X
బాలీవుడ్ స్టార్ హీరోలు స‌రైన హిట్లు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కార్తీక్ ఆర్య‌న్ 'భూల్ భుల‌యా' విజ‌యం ఇటీవ‌ల కొంత ఊపు తెచ్చింది. మునుముందు ఖాన్ లు న‌టించిన సినిమాల ఫ‌లితాలు ఎలా ఉంటాయి? అన్న చ‌ర్చ సాగుతోంది. కింగ్ ఖాన్ షారూక్ కంబ్యాక్ కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అన్న‌ది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. గ‌త నాలుగేళ్లుగా బాద్ షాకి స‌రైన విజ‌యం లేదు. న‌టించిన‌వ‌న్నీ డిజాస్ట‌ర్లు అవుతున్నాయి. దీంతో అత‌డు సౌత్ ద‌ర్శ‌కుడు అట్లీతో ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ని ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

షారుఖ్ ఖాన్ - అట్లీ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న భారీ థ్రిల్ల‌ర్ చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసి టైటిల్ టీజర్ ని ఇటీవ‌ల‌ విడుదల చేసారు. టీజ‌ర్ విడుదలైనప్పటి నుంచి ఇంటర్నెట్ షేకైంది. ఈ టీజర్ క్లిప్ లో SRK గాయపడిన ముఖం కట్టుతో చుట్టి క‌నిపించింది. పోస్టర్ లో అతను ప్రాణాంతక కిల్ల‌ర్ లాగా కనిపిస్తున్నాడు. ఖాన్ అభిమానుల‌ కోసం పర్ఫెక్ట్ మ‌సాలా యాక్షన్ థ్రిల్లర్ సిద్ధం చేస్తున్నాడ‌ని అర్థ‌మైంది.

అయితే నెటిజనుల్లో ఒక వర్గం ఇప్పుడు ఇది కాపీ క్యాట్ మూవీ అంటూ విమ‌ర్శిస్తున్నారు. హాలీవుడ్ నటుడు లియామ్ నీసన్ న‌టించిన‌ 1990 చిత్రం 'డార్క్ మ్యాన్'కి ఇది కాపీ అని ఆరోపిస్తున్నారు. జవాన్ లో షారూఖ్ గెటప్ 'డార్క్ మాన్' లో లియామ్ నీసన్ గెటప్ కు కాపీ అని నెటిజ‌నులు వాదిస్తున్నారు. జవాన్ ను డార్క్ మ్యాన్ కి రీమేక్ గా భావిస్తున్నారు. ''ఏక్ ఔర్ కాపీ #జవాన్ #డార్క్‌మ్యాన్. క‌చ్చితంగా అట్లీ బృందం అంతా మారుస్తారు. #బాలీవుడ్ తడ్కా.. మిర్చ్ మసాలా.. రొమాన్స్.. ఐటెం సాంగ్ చేర్చి #SRKతో ప్లాట్ కథను మారుస్తారు. కానీ మొత్తం ఆకృతి #కాపీక్యాట్ #బాలీవుడ్ కాపీగా ఉంటుంది'' అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఏది ఏమైనప్పటికీ ఇది నిజంగా 'డార్క్‌మ్యాన్‌'ను కాపీ చేసిన క‌థాంశ‌మా లేక ఒరిజిన‌ల్ స్టోరీనా? అన్న‌ది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. జవాన్ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇది 2 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. షారూక్ కెరీర్ లో అతి పెద్ద‌ పాన్ ఇండియా రిలీజ్ గా దీనిని సౌత్ లోనూ విడుద‌ల చేస్తార‌ని భావిస్తున్నారు.

అత‌డికి బ్రేకిచ్చే మూవీ ఏది?

2022- 2023లో విడుదలయ్యే 9 సినిమాల్లో షారూక్ కనిపించ‌నుండ‌డం ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం అట్లీ మూవీతో పాటు స్పై థ్రిల్లర్ అయిన పఠాన్ పైనే ఖాన్ గురి పెట్టాడు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండ‌గా.. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా అల‌రించ‌నుంది. 2023 జనవరి 25న మూవీ థియేటర్లలో విడుదల కానుంది. అలాగే రాజ్ కుమార్ హిరాణీతో షారూక్ భారీ ప్ర‌యోగం చేస్తున్నాడు. ఇమ్మిగ్రేషన్ ఆధారిత సామాజిక హాస్య చిత్రం లో త‌దుప‌రి న‌టించాల్సి ఉంది. షారుఖ్ ఖాన్ - తాప్సీ పన్ను ఇందులో నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా.. ఈ చిత్రం 2023 డిసెంబర్ 22న విడుదల కానుంది. అమీర్ ఖాన్- కరీనా కపూర్ నటించిన చిత్రం లాల్ సింగ్ చ‌ద్దా ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అలియా భట్- రణబీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రలో షారూక్ సైంటిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కానీ దీనికి సంబంధించిన అధికారిక లీక్ లు ఏవీ ఇవ్వ‌లేదు. టైగర్ 3 కోసం షారుఖ్ ఖాన్ -సల్మాన్ ఖాన్ మళ్లీ కలిసి ప‌ని చేసారు. ఈ సినిమాలో షారూక్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

R మాధవన్ నటించిన చిత్రంలో షారూక్ అతిథి పాత్ర‌ధారిగా న‌టించారు. భారతీయ శాస్త్రవేత్త .. ఏరోస్పేస్ ఇంజనీర్ S. నంబి నారాయణన్ బ‌యోపిక్ ఇది. ద్రవ ఇంధన రాకెట్ సాంకేతికతను పరిచయం చేయడంలో సుప్ర‌సిద్ధుడైన నంబియార్ జీవిత‌చ‌రిత్ర‌ను తెర‌పై ఉత్కంఠ‌భ‌రితంగా ఆవిష్క‌రిస్తుండ‌గా ఖాన్ అతిథిగా క‌నిపించ‌నున్నారు. ఆప‌రేష‌న్ కుక్రీ అనే దేశ‌భ‌క్తి చిత్రంలోనూ షారూక్ న‌టిస్తున్నారు. ఇది భారత సైన్యం - వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ కుక్రీ మిషన్ ఆధారంగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న‌ వార్ డ్రామా. వ‌చ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది.

కరణ్ జోహార్ పేరు పెట్టని ప్రాజెక్ట్ లోనూ అత‌డు న‌టిస్తున్నాడు. యాక్షన్ రొమాన్స్ చిత్రంలో ఖాన్ పాత్ర అదిరిపోనుందిట‌. ఇవ‌న్నీ ఈ రెండేళ్ల‌లోనే ఖాన్ అభిమానులకు ట్రీటివ్వ‌నున్నాయి. నాలుగేళ్ల పాటు త‌మ ఫేవ‌రెట్ నుంచి సినిమాల్లేక అల్లాడిన వారికి ఇప్పుడు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.