Begin typing your search above and press return to search.

బ్యాచిలర్ సినిమాకు షాదీముబారక్ దెబ్బకొట్టిందా..??

By:  Tupaki Desk   |   26 Jan 2021 11:30 PM GMT
బ్యాచిలర్ సినిమాకు షాదీముబారక్ దెబ్బకొట్టిందా..??
X
అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీగా రెడీ చేస్తున్నాడట. అయితే ఆరేంజ్ సినిమా తర్వాత అసలు హిట్ అనేది రుచి చూడలేదు డైరెక్టర్ భాస్కర్. అలాగే హీరో అఖిల్ అయితే మొదటినుండి హిట్ రుచి ఎరుగడు. ఇక వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పై ఇద్దరూ భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా మొదటి నుండి ఏదొక ఆటంకాన్ని ఎదుర్కొంటూనే ఉంది. నిజానికి గతేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తీరా లాక్ డౌబ్ అయిపోయి సంక్రాంతికి విడుదల కాబోతుంది అనే సమయానికి మరో ఆటంకం ఏర్పడింది. అదే రీషూట్. ఎందుకంటే ఈ సినిమా స్టోరీని పోలి మరో సినిమా రెడీ అవుతోంది.

అదే షాదీ ముబారక్. ఈ సినిమా గురించి ఎవరికీ సరిగ్గా తెలియదు. అయితే మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు(సాగర్) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కథ కూడా దాదాపు ఎలిజిబుల్ బ్యాచిలర్ లాగే ఉంటుందట. అందుకని మళ్లీ ఇద్దరూ అలాగే తీస్తే దెబ్బతినే అవకాశం ఉంది. ఇది గ్రహించిన బొమ్మరిల్లు భాస్కర్ టీమ్ మళ్లీ బ్యాచిలర్ మూవీ సెకండ్ హాఫ్ స్టోరీలో మార్పులు చేసి కొత్తగా స్క్రిప్ట్ రాసి రీషూట్ చేస్తున్నారు. అయితే షాదీ ముబారక్ సినిమాకు సహానిర్మాతగా వ్యవహారిస్తున్నాడు దిల్ రాజు. ఆ సినిమా గురించి ఎవ్వరూ కూడా ఇన్ఫర్మ్ చేయలేదట. ఇప్పుడు షాదీ ముబారక్ వలనే అఖిల్ మూవీ రీషూట్ అంటూ సమ్మర్ కి వాయిదా పడింది. బన్నీవాసు, వాసువర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. చూడాలి మరి ఈ బ్యాచిలర్ ఎలాంటి మార్పులతో వస్తాడో..!