Begin typing your search above and press return to search.

విడాకుల తర్వాతే సమంత బ్రాండ్ వాల్యూ మరింత పెరిగిందా..?

By:  Tupaki Desk   |   26 March 2022 1:38 PM GMT
విడాకుల తర్వాతే సమంత బ్రాండ్ వాల్యూ మరింత పెరిగిందా..?
X
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది. తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న విషయాల నుంచి బయటకు రావడానికి కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఓవైపు వరుస సినిమాలు మరోవైపు కమర్షియల్ యాడ్స్ కు సైన్ చేస్తూ వస్తోంది.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది సామ్. ఇక 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా' పాటలో తన వంపుసొంపులతో ఊపేసి బాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో అమ్మడి చేతిలోకి సరికొత్త బ్రాండ్లు వచ్చి చేరుతున్నాయి.

సమంత క్రేజ్ ను క్యాష్ చేసుకోడానికి బ్రాండ్లు ఆమె వెంట నడుస్తున్నాయా.. లేక తనే బ్రాండ్ల వెంట పడుతుందా అనేది తెలియదు కానీ.. వారానికో కొత్త బ్రాండ్ ప్రకటనతో సందడి చేస్తోంది.

లేటెస్టుగా స్పోర్టింగ్ యాప్ 'డ్రీమ్ 11' మరియు 'ఫార్చ్యూన్' సన్‌ ఫ్లవర్ ఆయిల్‌ లకు బ్రాండ్ అంబాసిడర్‌ గా సమంత నియమించబడింది. దీని కోసం ఆమెను పెద్ద మొత్తంలో చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి.

కొన్ని వారాల క్రితం సామ్ 'బ్లెండర్స్ ప్రైడ్ సౌత్' మరియు 'ఫాంటా' ప్రకటనలలో కనిపించింది సమంత. అంతకు ముందు 'మామఎర్త్' బ్రాండ్ ఆమెతో జతకట్టారు. వీటితో పాటుగా మరికొన్ని కంపెనీలు సామ్ ను ప్రచారకర్తగా నియమించుకుంటున్నాయి.

గ్లామరస్ క్వీన్ గా వెలుగొందుతున్న సమంతకు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ ఉండటం.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నందున రోజురోజుకూ ఆమె బ్రాండ్ వాల్యూ పెరుగుతోందని అర్థం అవుతోంది.

సామ్ నటించే సినిమాలు కూడా మంచి వసూళ్లను సాధిస్తున్నందున, ఆమెని ప్రచారకర్తగా తీసుకోవడం తప్పకుండా ఆ బ్రాండ్లకు సహాయం చేస్తుందని భావించవచ్చు. ఏదైతేనేం సమంత ఇప్పుడు ఇటు సినిమాలు అటు యాడ్స్ తో రెండు చేతులా సంపాదిస్తోంది.

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం 'యశోద' అనే మరో బహుభాషా చిత్రంలో నటిస్తోంది.

ఇక 'కణ్మణి రాంబో ఖతీజా' అనే సినిమాని రిలీజ్ కు రెడీ చేసింది. అమ్మడి చేతిలో 'అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ ఉంది. అలానే బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఓ వెబ్ సిరీస్ లో నటించనుంది.