Begin typing your search above and press return to search.

సమంత ప్రత్యేక పూజలు నిర్వహించిందా..?

By:  Tupaki Desk   |   8 Sep 2022 11:46 AM GMT
సమంత ప్రత్యేక పూజలు నిర్వహించిందా..?
X
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొన్ని వారాలుగా మీడియాకు దూరంగా ఉండటం.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే సామ్ ఇటీవల కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సమంత.. పూజారుల బృందంతో పూజలు ప్రార్థనలు నిర్వహించిందని అంటున్నారు. వేద పాటశాలలో జరిపిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే సమంత పూజ ఫోటోలు రీసెంటువా లేదా గతంలో ఆమె నిర్వహించిన పూజకు సంబంధించిన చిత్రాలా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి సామ్ తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత మానసికంగా దృఢంగా మారడానికి తీర్థయాత్రలు - విహారయాత్రలను మార్గంగా ఎంచుకుందని తెలుస్తోంది.

విడాకుల ప్రకటన తర్వాత తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి సమంత చార్ ధామ్ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గంగోత్రి - యమునోత్రి - బద్రీనాథ్ - కేదార్‌ నాథ్‌ లను సందర్శించింది. అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించింది.

అప్పట్లో దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి సామ్ ప్రత్యేక పూజలు నిర్వహించిందని చెప్పుకుంటున్నారు. ఆమె తెరపై సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ.. లోపల బాధను అనుభవిస్తోందని.. అందుకే పూజా మార్గాన్ని ఎంచుకుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే రాజ్ & డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయనుంది. 'అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా సామ్ చేతిలో ఉంది.

ఇదే క్రమంలో అక్షయ్ కుమార్ - ఆయుష్మాన్ ఖురాన్ వంటి బాలీవుడ్ హీరోలతో సమంత స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని సమాచారం. తమిళ్ లోనూ రెండు ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే 'శాకుంతలం' మరియు 'యశోద' వంటి రెండు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను అలరించబోతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.