Begin typing your search above and press return to search.

న‌య‌న్ తో సామ్ క్యాట్ ఫైట్ నిజ‌మేనా!

By:  Tupaki Desk   |   7 March 2020 5:45 AM GMT
న‌య‌న్ తో సామ్ క్యాట్ ఫైట్ నిజ‌మేనా!
X
అక్కినేని కోడ‌లు స‌మంత కోలీవుడ్ లో వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో న‌టించిన సామ్ ఆ త‌ర్వాత సినిమాల్ని త‌గ్గించింది. రేర్ గా మాత్ర‌మే సంత‌కం చేస్తోంది. కోలీవుడ్ లో న‌య‌న‌తార- స‌మంత‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌య‌న్ హ‌బ్బీ విఘ్న‌ష్ శివ‌న్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `కాథు వాకులా కాద‌ల్` అనేది టైటిల్. అయితే ఈ సినిమా సెట్స్ లో న‌య‌న్ తో సామ్ గొడ‌వ ప‌డుతోంద‌ని పుకార్లు షికారు చేశాయి. త‌మ‌ పాత్ర‌ల నిడివి విషయంలో స‌మంత‌..న‌య‌న్ మ‌ధ్య‌ గొడ‌వ త‌ప్ప‌లేద‌ని ప్ర‌చారం సాగింది. దీంతో హీరో విజ‌య్ సేతుప‌తి స‌హా.. ద‌ర్శ‌కుడు విఘ్నేష్ స‌ర్ధి చెప్పి వివాదాన్ని ప‌రిష్క‌రించారని వినిపించింది.

ఆ త‌ర్వాత స‌మంత ఎలాంటి గొడ‌వా జ‌ర‌గ‌లేద‌ని..న‌య‌న్..విఘ్నేష్ తో ప‌నిచేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపింది. సెట్స్ కు ఎప్పుడెప్పుడు వెళ్లాలా అన్న ఆత్రుత‌తో ఎదురుచూస్తున్నాని అంది. తాజాగా మ‌ళ్లీ స‌మంత‌- న‌య‌న్ మ‌ధ్య గొడ‌వ‌ల‌పై మ‌రోసారి కొత్త ప్ర‌చారం ఊపందుకుంది. ఈ సినిమా నుంచి స‌మంత త‌ప్పుకుంద‌నేది తాజా వార్త‌. అస‌లు న‌య‌న్ తో మ‌నస్ఫ‌ర్థ‌ల అవ‌స‌రం లేకుండానే సామ్ గ‌ర్భం దాల్చిన కార‌ణంగానే అనూహ్యంగా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

అయితే ఇది నిజ‌మా? అంటే అది స‌మంత‌నే క‌న్ఫామ్ చేయాల్సి ఉంటుంది. వాస్త‌వానికి ఇలాంటి ప్ర‌చారం స‌మంత‌పై రావ‌డం ఇదే కొత్త కాదు. గ‌తంలోనూ ప‌లు సినిమాల విష‌యంలో ఇలాంటి వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. మ‌రోసారి విఘ్నేష్ తో ప్రాజెక్టు విష‌యంలోనూ ఇలాంటి గాసిప్పులు షికారు చేస్తున్నాయి. ఈ త‌ర‌హా ప్ర‌చారానికి స‌మంత ఎలా బ‌దులిచ్చిందో తెలిసిందే. తాజాగా మ‌రోసారి స‌మంత గ‌ర్భిణి అని ప్రచారం సాగ‌డం అంత‌టా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. అలాగే స‌మంత త‌ప్పుకోవ‌డానికి అదొక్క‌టే కార‌ణం కాద‌ని...న‌య‌న్ తో విబేధం కూడా ఓ కార‌ణం అని చెబుతున్నారు. అయితే కోలీవుడ్ స‌ర్కిల్స్ మాత్రం ఇవ‌న్నీ క‌ట్టు క‌థ‌ల‌ని కొట్టి పారేస్తున్నాయి. మ‌రి స‌మంత ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుందా? లేదా? అన్నది తేలాలంటే త‌ను స్వ‌యంగా నోరు విప్పాల్సిందే.