Begin typing your search above and press return to search.
20 కోట్లు తృణప్రాయంగా వదులుకున్న సల్మాన్!
By: Tupaki Desk | 17 March 2022 11:59 PM ISTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్` లో సల్మాన్ భాయ్ అతిథిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అతిథి పాత్రకు 20 కోట్లు ఆఫర్ చేశారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిజంగా ఇంత పెద్ద పారితోషికం అంటే అది ఆశ్చర్యపరిచేదే.
నిజానికి అంత పెద్ద మొత్తాన్ని చిరుతో స్నేహం కారణంగా అతడు వద్దనుకున్నాడు. అంతేకాదు పారితోషికం ఇవ్వదలిస్తే తాను నటించనని కూడా అన్నాడు. సల్మాన్ ఖాన్ మూడ్ లో ఉన్నప్పుడు చాలా ఉదారంగా ఉంటాడు. అతడిని యారోన్ కా యార్ అని పిలుస్తారు, సన్నిహితులు స్నేహితుల కోసం తన మార్గం విడిచి బయటికి వెళ్తాడు.
సల్మాన్ తన యుక్తవయస్సు నుండి ఆరాధించే తెలుగు సూపర్ స్టార్ చిరంజీవితో శాశ్వతమైన బంధాన్ని కలిగి ఉన్నాడు. నిజానికి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తన బాలీవుడ్ అరంగేట్రం జంజీర్ కోసం ముంబైలో షూటింగ్ చేస్తున్నప్పుడు సల్మాన్ ప్రతిరోజూ రామ్ చరణ్ సెట్ కి వెళ్లి భోజనం చేసేవాడు. చిరు అంటే అంతటి అభిమానం భాయ్ కి. ఇకపోతే ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇస్తూ ఏకంగా పారితోషికాన్ని కూడా త్యజించారు భాయ్.
గాడ్ ఫాదర్ లో సల్మాన్ పోషించినది చాలా ప్రత్యేక అతిథి పాత్ర.. ఒరిజినల్ లో కంటే ఎక్కువగా పొడిగించిన అతిధి పాత్ర అని తెలిసింది. ఈ పాత్ర కోసం షూటింగ్ ప్రారంభించినప్పుడు సల్మాన్ తన పనికి ఒక్క పైసా కూడా తీసుకోలేనని స్పష్టంగా చెప్పాడు. ప్రాజెక్ట్ కి సంబంధించిన సోర్స్ ప్రకారం.. "చిరంజీవి నిర్మాతలు సల్మాన్ కి రూ. గాడ్‌ఫాదర్ లో నటిస్తున్నందున.. అతిథి పాత్రకు 15-20 కోట్లు ఇచ్చేందుకు ఓకే అయ్యారు.
కానీ సల్మాన్ మొండిగా ఉన్నాడు. చిరంజీవికి పారితోషికం ఇవ్వమని పట్టుపడితే తాను అతిధి పాత్రలో నటించనని చెప్పాడు. చిరంజీవిని ఉద్దేశించి సల్మాన్ ఏమని అడిగారంటే.. నా సినిమాలో ఒక పాత్ర చేయమని నేను మిమ్మల్ని అడిగితే దానికి మీరు వసూలు చేస్తారా? అంటూ కదిలించే ప్రశ్న వేసారట. ఆ ప్రశ్నకు చిరంజీవి మూగవోయారట. గాడ్ ఫాదర్ లో సల్మాన్ పాత్రకు 20 నిమిషాల నిడివి ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల పాటు షూటింగ్ లో పాల్గొననున్నాడు.