Begin typing your search above and press return to search.

`కోటిన్న‌ర‌` కొట్టేయాల‌ని చూసింది కానీ..!

By:  Tupaki Desk   |   7 May 2020 10:15 AM IST
`కోటిన్న‌ర‌` కొట్టేయాల‌ని చూసింది కానీ..!
X
దీపం ఉండ‌గానే చ‌క్క‌బెట్టుకోవాలి ఇక్క‌డ‌. ఈ ఫార్ములాని మ‌న క‌థానాయిక‌లు తూ.చ త‌ప్ప‌క అనుస‌రిస్తుంటార‌న్న‌ది తెలిసిందే. ఆ కోవ‌లోనే వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న ర‌ష్మిక మంద‌న ఉన్న‌ట్టుండి భారీగా పారితోషికం పెంచేయడం ఇటీవ‌ల ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. స‌రిలేరు నీకెవ్వరు- భీష్మ లాంటి బంప‌ర్ హిట్ల‌తో అమ్మ‌డి జోరు అంత‌కంత‌కు స్కైని ట‌చ్ చేసింది. ఆ క్ర‌మంలోనే ఈ క‌న్న‌డ గోల్డెన్ లెగ్ కి ఎంత పారితోషికం చెల్లించేందుకైనా మ‌న నిర్మాత‌లు సిద్ధ‌మైపోయారు.

ప్ర‌స్తుతం ఈ భామ వ‌రుస‌గా రెండు భారీ చిత్రాల‌కు సంత‌కాలు చేసిన సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ ప్రాజెక్టు పుష్ప తో పాటు.. అటు త‌మిళంలో కార్తీ స‌ర‌స‌న వేరొక భారీ చిత్రానికి సంత‌కం చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం ఈ అమ్మ‌డు నిర్మాత‌ల నుంచి కోటిన్న‌ర పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ట‌. అయితే అంత పారితోషికం ఇప్పుడున్న స‌న్నివేశంలో వ‌ర్క‌వుట‌వుతుందా? అస‌లే క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీల‌న్నీ అల్ల‌క‌ల్లోలంగా ఉన్నాయి. ఈ ప్ర‌భావం ఇంకెంత‌కాలం ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఇలాంట‌ప్పుడు ఆర్టిస్టుల పారితోషికాలు స‌హా పెద్ద రేంజు టెక్నీషియ‌న్ల పారితోషికాల్ని కోసేసే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంచ‌నా వెలువ‌డింది. ఆ క్ర‌మంలోనే ర‌ష్మిక పారితోషికానికి ఎస‌రు త‌ప్ప‌ద‌నే టాక్ వినిపిస్తోంది. ఇది కేవ‌లం ర‌ష్మిక‌కు మాత్ర‌మే ఎదురవుతున్న స‌న్నివేశం కాదు.. ఇది అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు. స్టార్ హీరోలు.. హీరోయిన్లతో పాటు భారీ పారితోషికాల్ని దించాల్సిన టైమ్ వ‌చ్చింద‌న్న చ‌ర్చా తెలుగు సినిమా నిర్మాత‌ల మండ‌లిలో సాగుతోంది. తాజా ప‌రిణామంతో కోటి పైగా పారితోషికం అందుకోవాల‌న్న ట్యాలెంటెడ్ ర‌ష్మిక క‌ల నెర‌వేర‌ని ప‌రిస్థితి. ఈ భామ‌లానే ఇత‌ర రైజింగ్ స్టార్ల ప‌రిస్థితి ఉండ‌నుంద‌ని చెబుతున్నారు.