Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్‌ డైరెక్ట‌ర్ ని ప్ర‌భాస్‌ తిర‌స్క‌రించారా?

By:  Tupaki Desk   |   31 May 2022 9:26 AM GMT
బ్లాక్ బ‌స్ట‌ర్‌ డైరెక్ట‌ర్ ని ప్ర‌భాస్‌ తిర‌స్క‌రించారా?
X
బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గా పేరొస్తే అత‌నితో సినిమాలు చేయాల‌ని చాలా మంది హీరోలు, స్టార్స్ ఎదురుచూస్తుంటారు. కానీ ఇక్క‌డ అందుకు భిన్నంగా ఓ స్టార్ డైరెక్ట‌ర్ ప‌రిస్థితి తిర‌స్క‌ర‌ణ‌కు గురికావ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కార్తి హీరోగా 'ఖైదీ' సినిమాని రూపొందించి ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. ఈ చిత్రంలో కార్తికి హీరోయిన్ లేకుండానే సినిమాని మొత్తం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా న‌డిపించి శ‌భాష్ అనిపించారు.

ఇక ఈ మూవీ త‌రువాత లోకేష్ క‌న‌గ‌రాజ్ చేసిన భారీ చిత్రం 'మాస్ట‌ర్‌'. ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ విజ‌యాన్ని సాధించింది. ఇందులోనూ హీరో విజ‌య్ కి హీరోయిన్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. సినిమాలో మాళ‌వికా మోహ‌న‌న్ వున్నా అమెకున్న ప్రాధాన్య‌త చాలా త‌క్కువ‌. అంతే కాకుండా హీరో విజ‌య్ తో ఎలాంటి డ్యూయెట్ లు కూడా వుండ‌వు. దీంతో విజ‌య్ కు కూడా హీరోయిన్ లేకుండా 'మాస్ట‌ర్' ని రూపొందించి మ‌రో సారి త‌న స‌త్తా చాటుకున్నారు.

ప్ర‌స్తుతం యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ తో యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా 'విక్ర‌మ్‌' మూవీని రూపొందిస్తున్నారు. జూన్ 3న ఈ మూవీ విడుద‌ల కానుంది. దీని త‌రువాత తెలుగు స్టార్ హీరోతో సినిమా చేయాల‌ని లోకేష్ క‌న‌గ‌రాజ్ గ‌త కొన్ని రోజులుగా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.

ఇటీవ‌లే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని క‌లిసార‌ని, హైద‌రాబాద్ లో ప్ర‌భాస్ కోస‌మే లోకేష్ క‌న‌గ‌రాజ్ వారం పాటు స్టే చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే రెండు సార్లు ప్ర‌భాస్ ని క‌లిసిన లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌న వ‌ద్ద వున్న ఓ సూప‌ర్ ఐడియాని ప్ర‌భాస్ కు వినిపించార‌ని, అయితే ప్ర‌భాస్ మాత్రం లోకేష్ చెప్పిన స్క్రిప్ట్ ఐడియాని సున్నితంగా తిర‌స్క‌రించార‌ని చెబుతున్నారు. కార‌ణం మ‌ళ్లీ మాస్ట‌ర్‌, విక్ర‌మ్, ఖైదీ త‌ర‌హా యాక్ష‌న్ స్టోరీని లోకేష్ క‌న‌గ‌రాజ్ .. ప్ర‌భాస్ కు వినిపించార‌ని, అయితే త‌న‌కు లార్జ‌ర్ దెన్ లైఫ్ స్క్రిప్ట్ లు మాత్ర‌మే కావాల‌ని, రొటీన్ యాక్ష‌న్ డ్రామా క‌థ‌లు అవ‌స‌రం లేద‌ని ప్ర‌భాస్ చెప్పిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌.

అయితే ఈ వార్త‌లు విన్న వాళ్లు మాత్రం ప్ర‌భాస్ చెప్పింది క‌రెక్టే అని, లోకేష్ సాధార‌ణ రొటీన్ యాక్ష‌న్ క‌థ‌ల్ని కాకుండా భారీ స్పాన్ వున్న క‌థ‌ల‌పై ఫోక‌స్ పెడితే అప్పుడు ప్ర‌భాస్ ని ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని చెబుతుతున్నారు. 'విక్ర‌మ్‌' త‌రువాత లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరో విజ‌య్ తో సినిమా చేయ‌బోతున్నాడు. అంతే కాకుండా కార్తితో చేసిన 'ఖైదీ'కి పీక్వెల్ ని కూడా తెర‌పైకి తీసుకురాబోతున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్ ల త‌రువాత ప్ర‌భాస్ మెచ్చే క‌థ‌తో లోకేష్ మ‌రోసారి ప్ర‌య‌త్నించ‌బోతున్నాడ‌ని త‌మిళ వ‌ర్గాలు అంటున్నాయి.