Begin typing your search above and press return to search.

యాంటీ ఫ్యాన్స్ చెప్పిందే 'పవర్ స్టార్' ఫాలో అయ్యాడా...?

By:  Tupaki Desk   |   24 July 2020 7:00 AM IST
యాంటీ ఫ్యాన్స్ చెప్పిందే పవర్ స్టార్ ఫాలో అయ్యాడా...?
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వాస్తవ సంఘటల ఆధారంగా కాంట్రవర్సీ టైటిల్స్ పెట్టి సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడనే విషయం అందరికి తెలిసిందే. అయితే నిజ జీవిత కథలు తెరకెక్కించడంలో వర్మ తనదైన శైలిలో ముందుకు పోతుంటారు. అందరు డైరెక్టర్స్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని సినిమాగా రూపొందించే క్రమంలో కుటుంబ సభ్యులను స్నేహితులను దగ్గరి వ్యక్తులను అడిగి తెలుసుకున్న విషయాలను.. అందరికి తెలిసిన విషయాలను సినిమాగా రూపొందిస్తారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇంట్లో పని చేసే వారిని.. డ్రైవర్లని.. వంట మనుషులను అడిగి వివరాలు సేకరిస్తారు. ఏదన్నా అంటే పెద్ద పెద్దవాళ్ళ సీక్రెట్స్ అన్నీ తెలిసేది వాళ్ళ ఇంట్లో పనిచేసే వారికే అంటాడు వర్మ. ఈ క్రమంలో ఇప్పటికే 'సత్య' 'సర్కార్' 'రక్త చరిత్ర' 'వంగవీటి' 'లక్ష్మీస్ ఎన్టీఆర్' 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే సినిమాలు తెరకెక్కించి సంచలనం రేపాడు. ఇతరులు చెప్పిన విషయాలకు తనకు తెలిసిన అంశాలను జోడించి సినిమా తీస్తాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దిశా మర్డర్ కేసుపై సినిమా తీస్తానని ప్రకటించాడు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యోదంతం నేపథ్యంలో అమృత - ప్రణయ్ - మారుతీరావుల విషాద గాథ ఆధారంగా 'మర్డర్' అనే సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల చెప్పుకొచ్చాడు.

కాగా వర్మ నిజ జీవిత కథలను పాత్రలను ఆధారంగా చేసుకొని సెటైరికల్ గా సినిమాలు తీసినా చాలా రీసెర్చ్ చేస్తాడని చెప్పుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ మీద వ్యగ్యంగా తీసిన ''పవర్ స్టార్'' సినిమా విషయంలో మాత్రం రామ్ గోపాల్ వర్మ పెద్దగా రీసెర్చ్ చేసినట్లుగా అనిపించడం లేదు. ఇటీవల విడుదలైన 'పవర్ స్టార్' ట్రైలర్ చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థం అయిపోతుంది. ప్రవన్ కళ్యాణ్ ని ప్రధాన పాత్రలో చూపించిన వర్మ చాలా వరకు సన్నివేశాలు రియల్ లైఫ్ లో జరగని ఇన్సిడెంట్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రవన్ కళ్యాణ్ మేనరిజం.. మాటలు.. మూగ జీవాలకు గడ్డి తినిపించడం లాంటివి నిజ జీవిత వ్యక్తిని పోలి ఉన్నప్పటికీ ట్రైలర్ లో చూపించిన చాలా అంశాలు వర్మ క్రియేట్ చేసినవే అని చెప్పవచ్చు. ప్రవన్ కళ్యాణ్ ఎన్నికలలో ఓటమి తర్వాత ఓ డైరెక్టర్ ని కొట్టినట్లుగా.. ఓ పొలిటికల్ లీడర్ ని ఓటమికి బాధ్యుడిని చేసి మాట్లాడినట్లు.. అతన్ని అభిమానించే ప్రొడ్యూసర్ ఎన్నికలలో ఓడిపోవాలని కోరుకున్నటుగా.. హీరో అన్న నీకు ఐడెంటిటీ ఎలా వచ్చిందో గుండెల మీద చెయ్యేసుకుని చెప్పమన్నట్లుగా ట్రైలర్ లో చూపించాడు. ఇవన్నీ రియల్ లైఫ్ లో అసాధ్యమైన సంఘటనలు. అయితే ఇవన్నీ పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ చెప్పిన విషయాలుగా కనిపిస్తున్నాయి. పవన్ పై ద్వేషంతో చెప్పిన సన్నివేశాల వలె ఈ సీన్స్ ఉన్నాయి. మరి వర్మ అలాంటి సన్నివేశాలు క్రియేట్ చేయడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటో ఆయన నోటి వెంట వస్తే కానీ నిజానిజాలు తెలియవు.