Begin typing your search above and press return to search.

అజ్ఞాత‌వాసి న‌ష్టాలు ప‌వ‌న్ నెత్తిన వేసుకున్నాడా?

By:  Tupaki Desk   |   27 Feb 2020 11:22 AM IST
అజ్ఞాత‌వాసి న‌ష్టాలు ప‌వ‌న్ నెత్తిన వేసుకున్నాడా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ విష‌యాలు ప‌క్క‌న‌బెడితే వ్య‌క్తిగ‌తంగా ప‌వ‌న్ నిర్మాత‌ల ప‌ట్ల దేవుడే. ప‌వ‌న్ తో సినిమా నిర్మించి న‌ష్టాలొస్తే అత‌న్ని ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. తీసుకున్న పారితోషికంలో కొంత తిరిగివ్వ‌డ‌మో...అదీ న‌చ్చ‌క‌పోతే మొత్తం తిరిగి ఇవ్వ‌డం ప‌వ‌న్ ఒక్క‌రికే సాధ్య‌మైంది. టాలీవుడ్ లో ఏ హీరో కూడా నిర్మాత‌ల ప‌ట్ల ఇలా ఆలోచించ‌రేమో. ప‌వ‌న్ తో ప‌ని చేసిన నిర్మాత‌లో బ‌హిరంగంగా ఎన్నోసార్లు ఈ విష‌యాలు చెప్పారు. నిజానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల్లో గాడ్ అయింది కూడా అలాగే. ఓ స్టార్ గా క‌న్నా..వ్య‌క్తిగ‌తంగా మంచి సేవాదృక్ఫ‌థం ఉన్నవాడిగా అంద‌రి మ‌న‌సుల‌ను గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే.

తాజ‌గా ప‌వ‌న్ మ‌రోసారి త‌న మంచి మ‌న‌సు చాటుకున్న‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారికా హాసిని క్రియేష‌న్స్ లో రాధాకృష్ణ `అజ్ఞాత‌వాసి` చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫలితాలు సాధించ‌లేదు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన సినిమా ఓ పెనింగ్ డే క‌లెక్ష‌న్లు బాగున్నా...ఆ మ‌రుస‌టి నుంచి చ‌ప్ప‌బ‌డిపోయింది. దీంతో అజ్ఞాత‌వాసి ప‌నైపోయింది. నిర్మాతల‌కు..డిస్ర్టిబ్యూట‌ర్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. సినిమాకు నిర్మాత రాధాకృష్ణ భారీగానే ఖ‌ర్చు చేసారు. కానీ అందులో సంగం కూడా తీసుకు రాలేదు. నిర్మాణ ప‌రంగాను..ప్ర‌చార ప‌రంగా అను అన్ని ర‌కాలుగా లాస్ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో పవ‌న్ ఆ సినిమాకు తీసుకున్న పారితోషికంలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించిన‌ట్లు చెబుతున్నారు. మ‌రి ఇప్పుడే ఈ వార్త ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌వ‌న్ ప్లాప్ అయిన వెంట‌నే చెల్లించాలి క‌దా? అని ఓసందేహం వ‌స్తుంది. అప్పుడు ప‌వ‌న్ ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఇవ్వ‌లేక‌పోయాడుట‌. ప్ర‌స్తుతం వ‌రుస‌గా మూడు సినిమాలు క‌మిట్ అయ్యాడు. ఆ మూడు సినిమాల‌కు క‌లిపి భారీ మొత్తంలోనే అందుకుంటున్నాడుట‌. ఇప్ప‌టికే అడ్వాన్స్ గా నిర్మాతలు కొంత చెల్లించారు. ఆ డ‌బ్బులో కొంత‌ రాధాకృష్ణ‌ కు ఇచ్చిన‌ట్లు వినిపిస్తుంది.