Begin typing your search above and press return to search.

నాగార్జున తన నిర్ణయం మార్చుకోనట్లేనా?

By:  Tupaki Desk   |   24 March 2021 8:30 AM GMT
నాగార్జున తన నిర్ణయం మార్చుకోనట్లేనా?
X
టాలీవుడ్ కింగ్‌ నాగార్జున మన్మధుడు 2 చిత్రం తర్వాత ప్రేక్షకులు తనను రొమాంటిక్ పాత్రల్లో చూసేందుకు ఆసక్త చూపించడం లేదని అందుకే ఆ తరహా జోనర్‌ లో సినిమా లు చేయకూడదనే నిర్ణయానికి వచ్చాడంటూ ఆమద్య వార్తలు వచ్చాయి. నాగార్జున ఇటీవల వరుసగా కమిట్ అవుతున్న సినిమాలు చేస్తున్న సినిమాలను చూస్తుంటే నాగార్జున నిజంగానే రొమాంటిక్ సినిమాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాడా అనిపిస్తుంది. నాగార్జున కెరీర్‌ లో ఎక్కువగా రొమాంటిక్ పాత్రలను చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అలాంటి పాత్రలను చేయను అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ నిరుత్సాహం వ్యక్తం చేయడం ఖాయం. వరుసగా యాక్షన్‌ సినిమాలను చేయడం వల్ల ఒక వర్గం ప్రేక్షకులకు నాగ్‌ దూరం అవుతాడేమో అంటూ సోషల్‌ మీడియా టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం నాగార్జున చేస్తున్న బంగార్రాజు సినిమాలో కూడా రొమాంటిక్ పాత్రను కాకుండా కాస్త వైవిధ్యభరితంగా ఉండే పాత్రను నాగార్జున చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కాని నాగార్జున సినిమాలు మాత్రం ప్రధానంగా యాక్షన్‌ ప్రధానంగా సాగుతాయనే టాక్‌ వినిపిస్తుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వైల్డ్‌ డాగ్‌ ఆ తర్వాత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్ అంటున్నారు. ముందు ముందు నాగార్జున నుండి రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ సినిమాలు చూడాలనుకుంటున్నట్లుగా అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. కాని నాగార్జున మాత్రం తన నిర్ణయంను మార్చుకుంటాడా లేదా అనేది తెలియడం లేదు.