Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ కు నాగ‌చైత‌న్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడా?

By:  Tupaki Desk   |   15 Oct 2022 7:27 AM GMT
ఆ డైరెక్ట‌ర్ కు నాగ‌చైత‌న్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడా?
X
అక్కినేని నాగచైత‌న్య‌.. రానా డైరెక్ట‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడా? అంటే అవునే స‌మాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ట్ చేస్తున్న బైలింగ్వ‌ల్ మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈమూవీకి మ్యూజిక్ మాస్ట్రో ఇళ‌య‌రాజాఆయ‌న త‌న‌యుడు యువ‌న్ శంక‌ర్ రాజా సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.

ఇలా తండ్రీ కొడుకులు సంగీతం అందిస్తున్న తొలి సినిమా ఇదే కావ‌డం విశేషం. నాగ‌చైత‌న్య ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో అర‌వింద్ స్వామి, శ‌ర‌త్ కుమార్‌, ప్రియ‌మ‌ణి, సంప‌త్ రాజ్‌, వెన్నెల కిషోర్ న‌టిస్తున్నారు. వీరితో పాటు 'కార్తీక దీపం' ఫేమ్ వంట‌ల‌క్క ప్రేమి విశ్వ‌నాథ్ కూడా న‌టిస్తోంది. బుల్లితెర‌పై ఆక‌ట్టుకున్న ప్రేమి విశ్వాన‌థ్ కు తెలుగులో ఇదో ఫ‌స్ట్ మూవీ కావ‌డం విశేషం.

ఇదిలా వుంటే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ గ‌త కొన్ని రోజులుగా క‌ర్ణాట‌క‌లోని మైసూర్ లో జ‌రుగుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత నాగ‌చైత‌న్య మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే క‌థ‌తో 'విరాట‌ప‌ర్వం' మూవీని వేణు ఊడుగుల తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. సాయి ప‌ల్ల‌వి న‌ట‌న ప్ర‌ధాన హైలైట్ గా న‌క్స‌ల్ ఉద్యమం నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు.

రీసెంట్ గా విడుద‌లైన ఈ మూవీకి ప్రేక్ష‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఈ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్నాడ‌ట‌. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నున్న ఈ మూవీని రీసెంట్ గా 'సీతారామం'తో ఎపిక్‌ బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌నుంద‌ని తెలుస్తోంది.

దీనితో పాటు చై 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ‌లో ప‌ర‌శురామ్ తెర‌కెక్కించ‌నున్నమూవీని కూడా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. 'నాగేశ్వ‌ర‌రావు' పేరుతో ప‌ర‌శురామ్ తెర‌పైకి తీసుకురావాల‌ని గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చైతూ ఎప్ప‌డు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే అప్ప‌డు ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించాల‌ని ప‌ర‌శురామ్ ప్లాన్ చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఈ రెండు ప్రాజెక్ట్ ల‌లో నాగ‌చైత‌న్య ఏ ప్రాజెక్ట్ ని ముందు సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడో వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.