Begin typing your search above and press return to search.

బేబమ్మ నిజంగానే నో చెప్పిందా?

By:  Tupaki Desk   |   7 March 2022 8:00 AM GMT
బేబమ్మ నిజంగానే నో చెప్పిందా?
X
ఉప్పెన సినిమా తో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. హీరోయిన్ గా ఇప్పటి వరకు ఆమె చేసిన ఉప్పెన.. శ్యామ్‌ సింగ రాయ్‌.. బంగార్రాజు ఇలా అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. టాలీవుడ్‌ లో ఈమె ఎంట్రీ సాలిడ్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సమయంలో బాలయ్య సినిమాలో కీలక పాత్రకు (హీరోయిన్‌ కాకుండా) గాను ఈమెను సంప్రదించారనే వార్తలు వచ్చాయి.

బాలయ్య సినిమాలో కీలక పాత్ర లో నటించేందుకు సున్నితంగా కృతి శెట్టి నో చెప్పిందట. దాంతో బాలయ్య సినిమా కు మరో హీరోయిన్‌ ను సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేస్తున్న కృతి శెట్టి కీలక పాత్రలో కాని.. సెకండ్‌ హీరోయిన్ పాత్రకు గాని ఎలా ఓకే చెబుతుందంటూ ఆమె అభిమానులు ఈ సమయంలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 28వ సినిమా లో కీలక పాత్రకు గాను కృతి శెట్టిన ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. సినిమా కోసం ఈమెను సంప్రదించారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ సమయంలో బేబమ్మ మహేష్‌ బాబు సినిమా లో అంటే ఓకే కాని సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకు ఎలా ఒప్పుకుంది అంటూ షాక్‌ అవుతున్నారు. మహేష్‌ బాబు.. త్రివిక్రమ్‌ కాంబో మూవీలో ఇప్పటికే పూజా హెగ్డేను హీరోయిన్‌ గా ఎంపిక చేయడం జరిగింది.

సినిమా పూజా కార్యక్రమాల్లో పూజా హెగ్డే కూడా పాల్గొంది. కనుక ఆమె మెయిన్‌ హీరోయిన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. త్రివిక్రమ్‌ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉండటం చాలా కామన్‌ గా చూస్తూ ఉంటాం. కనుక ఈ సినిమా లో సెకండ్‌ హీరోయిన్ గా బేబమ్మ కృతి శెట్టిని ఎంపిక చేయాలని భావించి ఉంటారు. అందుకు ఆమె నో చెప్పి ఉంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్‌ బాబు త్రివిక్రమ్‌ కాంబో మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆ సినిమా నుండి ఇలాంటి పుకార్లు షికార్లు చేయడం అభిమానులకు కాస్త నిరాశ ను కలిగిస్తుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా త్రివిక్రమ్‌ నుండి మహేష్‌ సినిమా వస్తుందనే నమ్మకంను పెట్టుకుని మరీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో సినిమా గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా ప్రారంభంకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కనుక అప్పటి వరకు ఇలాంటి పుకార్లు మీడియాలో షికారు చేస్తూనే ఉంటుంది. సినిమా ప్రారంభించి ఇదే ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసినిమా లో మహేష్ బాబు రోల్‌ చాలా డిఫరెంట్‌ గా ఉంటుందని అంటున్నారు.