Begin typing your search above and press return to search.

అక్కగా అమ్మగా... కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలైందా?

By:  Tupaki Desk   |   10 July 2021 5:00 PM IST
అక్కగా అమ్మగా... కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలైందా?
X
హీరోయిన్స్‌ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగడం కష్టం. హీరోలు అయిదు ఆరు పదుల వయసులో కూడా హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు కాని హీరోయిన్స్ విషయానికి వస్తే మూడు పదుల వయసులోనే వారు హీరోయిన్స్‌ గా రిటైర్డ్‌ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అమ్మగా అక్కగా నటిస్తూ కెరీర్‌ ను నెట్టుకు వస్తూ ఉంటారు. హీరోయిన్‌ గా ఆఫర్లు తగ్గిన సమయంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా చేసేందుకు సిద్దం అయ్యే హీరోయిన్స్‌ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు అయిదు పది సంవత్సరాల గ్యాప్‌ ను కొందరు తీసుకుంటారు. కాని కాజల్‌ మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ ను అప్పుడే మొదలు పెట్టిందా అంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాజల్‌ హీరోయిన్‌ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. అయితే ఈ అమ్మడు ఈమద్య కాలంలో కాస్త ఆఫర్లు తగ్గాయి. సీనియర్ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ ఉన్నా కూడా ఈమె కెరీర్‌ విషయంలో కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ఆమె మెల్ల మెల్లగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ను మొదలు పెడుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మోసగాళ్లు సినిమాలో మంచు విష్ణుకు అక్కగా నటించిన కాజల్‌ ఇప్పుడు అమ్మ పాత్రకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి.

తమిళంలో రూపొందుతున్న రౌడీ బేబీ అనే సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ ఒక తల్లిగా కనిపించబోతుంది. పెళ్లి అయిన తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆమె కాస్త జాగ్రత్తలు తీసుకుంటుందా అంటే ఔను అని దీన్ని బట్టి అర్థం అవుతుంది. మరీ కమర్షియల్‌ పాత్రల్లో ఆమె నటించాలని అనుకోవడం లేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది. చిన్నా చితక హీరోలతో ఈమెకు నటించే అవకాశం వస్తుంది. కాని గౌరవ ప్రథమైన పాత్రలు చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాల ఎంపిక విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటుంది అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. నిజంగానే కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు అయ్యిందంటే ముందు ముందు యంగ్‌ హీరోలతో ఈమె రొమాన్స్‌ చేయడం మనం చూడక పోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.