Begin typing your search above and press return to search.

విష్ణు భేటీతో సినీ ప్రముఖుల్ని సీఎం జగన్ అవమానించారా?

By:  Tupaki Desk   |   16 Feb 2022 4:42 AM GMT
విష్ణు భేటీతో సినీ ప్రముఖుల్ని సీఎం జగన్ అవమానించారా?
X
‘మా’ అధ్యక్షుడు కమ్ సినీ నటుడు ముంచు విష్ణు తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవటం తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తలు రావటం.. అందరూ చదవటం కూడా చేసేశారు. సీఎం జగన్ తో భేటీ అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడే అప్డేట్ కూడా అందరికి తెలిసిన విషయమే. కానీ.. చాలామందికి తెలీని కొత్త విషయం ఏమంటే.. సినీ ప్రముఖులతో భేటీ అయిన సందర్భంలో సీఎం జగన్ ఇచ్చిన ప్రయారిటీకి.. తాజాగా విష్ణుతో భేటీ సందర్భంగా ఇచ్చిన ట్రీట్ మెంట్ కు ఏ మాత్రం పొంతన లేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా సినీ ప్రముఖులు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో వారికి గ్రాండ్ వెల్ కం ఉంటుంది. కొన్నిసార్లు వారిని స్వయంగా స్వాగతం చెప్పటం.. తిరిగి వెళ్లే వేళలో వీడ్కోలు పలకటం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వెల్ కం చెప్పే బాధ్యతను కీలకమైన వారికి అప్పజెప్పి.. వారి మనసులు గాయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

మొన్న సీఎం జగన్ ను కలిసేందుకు ప్రత్యేక చాపర్ లో విజయవాడకు వెళ్లిన సినీ ప్రముఖుల కార్లను.. సీఎం క్యాంప్ ఆఫీసులో ఆపేసి.. అక్కడి నుంచి సీఎంతో భేటీ అయ్యే ప్రాంతం వరకు నడిపించిన వైనం బయటకు రావటం తెలిసిందే.

అంతేకాదు.. సినీ ప్రముఖుల్ని రోజువారీగా ముఖ్యమంత్రి రివ్యూ చేసే సమీక్షా మందిరానికే పరిమితం చేశారు తప్పించి.. అంతకు మించి చేసింది లేదు. అదే సమయంలో.. తనతో మెగాస్టార్ చిరంజీవి బతిమిలాడిన వైనానికి సంబంధించిన వీడియోను కూడా ప్రభుత్వ వర్గాలు బయటకు విడుదల చేయటంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా మంచు విష్ణు.. అప్పటికప్పుడు హడావుడిగా బయలుదేరి విజయవాడకు వెళ్లినా.. ఆయనకు గ్రాండ్ వెల్ కం దక్కటమే కాదు.. ఆయన్ను ముఖ్యమంత్రి నివాసానికి ఆహ్వానించటంతో పాటు.. భోజనం చేసిన అనంతరం దాదాపు రెండు గంట లపాటు సీఎంతోనే గడిపటం గమనార్హం.

సినిమా రంగానికి మూల స్తంభాలైన ప్రముఖులను సమావేశ మందిరానికే పరిమితం చేసిన ముఖ్యమంత్రి జగన్.. విష్ణును కలిసిన సందర్భంగా వ్యవహరించిన తీరుకు పొంతన లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. తన చేతలతో సీఎం జగన్ చెప్పాల్సింది చెప్పారన్న మాట వినిపిస్తోంది. ఇది కచ్ఛితంగా అవమానమేనని సినీ వర్గాలకు చెందిన కొందరు వ్యాఖ్యానిస్తే.. అలా జరుగుతుందని తెలిసే వెళ్లినప్పుడు.. అదెందుకు అవమానం అవుతుందన్న కౌంటర్ మాట చిత్ర రంగానికి చెందిన వారి నోటి నుంచి వస్తోంది.