Begin typing your search above and press return to search.

'పాన్ ఇండియా మూవీ' పై బాలీవుడ్ బాద్షా దృష్టిపడిందా..??

By:  Tupaki Desk   |   16 Jan 2021 11:00 AM IST
పాన్ ఇండియా మూవీ పై బాలీవుడ్ బాద్షా దృష్టిపడిందా..??
X
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుండి చివరి సినిమా వచ్చి రెండేళ్లు కావస్తుంది. కానీ ఇంతవరకు షారుఖ్ నుండి తదుపరి సినిమాకు సంబంధించిన వార్త బయటికి రాలేదు. నిజానికి జీరో సినిమా పైనే షారుఖ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమాతో షారుఖ్ ఘోరంగా దెబ్బతిన్నాడు. జీరో సినిమా మిగిల్చిన నష్టం నుండి కోలుకోవడానికే షారుఖ్ ఇంకా గ్యాప్ తీసుకుంటున్నాడేమో అని ఇండస్ట్రీ టాక్. నిజంగానే షారుఖ్ అదే కారణంతో బయటికి రాట్లేడా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. షారుఖ్ సినీ కెరీర్ లో సూపర్ హిట్లతో పాటు గతంలో కూడా ఫ్లాపులున్నాయి. కానీ జీరో మాత్రం నిజంగా జీరోని చేసింది. గడిచిన రెండేళ్ల కాలంలో షారుఖ్ నెక్స్ట్ సినిమా గురించి రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా షారుఖ్ పాన్ ఇండియా సినిమా పై ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. ఎందుకంటే రానురాను సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలు లేకుండా పోతున్నాయి. ఆల్రెడీ తెలుగు నుండి ప్రభాస్, కన్నడ నుండి యష్ వారి సినిమాలతో ప్రూవ్ చేశారు.

బాహుబలి సినిమా వచ్చినప్పుడే సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు ఆ మార్కెట్ ని సౌత్ సినిమాలు పూర్తిగా వాడుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు సౌత్ నుండి చాలా హీరోల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఇక బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ దబాంగ్-3తో, అమిర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమాలతో సౌత్ వైపు మార్కెట్ ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు అదే బాటలో షారుఖ్ ట్రై చేస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి. తమిళ డైరెక్టర్ అట్లీతో షారుఖ్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనీ షారుఖ్ భావిస్తున్నాడట. ఇంతవరకు వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందో లేదో తెలియలేదు కానీ పాన్ ఇండియా మూవీగా రాబోతుందని మాత్రం వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చూడాలి మరి షారుఖ్ నుండి ఎలాంటి కబురు వినిపిస్తుందో..!!