Begin typing your search above and press return to search.
కరోనా క్రైసిస్ లో కూడా ఒక్క ప్రాజెక్ట్స్ ఆపలేదు!
By: Tupaki Desk | 23 Sept 2020 2:40 PM ISTకరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాలలో చిత్ర పరిశ్రమ ఒకటి. గత ఆరున్నర నెలలుగా థియేటర్స్ మూతపడిపోయి.. సినిమాలు రిలీజ్ అవకపోవడంతో ప్రొడ్యూసర్స్ సినిమాలపై పెట్టిన కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీరితో పాటు సినిమా రిలీజులు లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబ్యూటర్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. మన టాలీవుడ్ విషయానికొస్తే కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ ఒకటని చెప్పవచ్చు. లాక్ డౌన్ కి ముందు గీతా ఆర్ట్స్ మరియు జీఏ 2 బ్యానర్స్ పై అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. నిఖిల్ '18 పేజెస్'.. కార్తికేయ 'చావు కబురు చల్లగా'.. హిందీ 'జెర్సీ' సినిమాల నిర్మాణం స్టార్ట్ చేశారు. వీటితో పాటు అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా.. నిఖిల్ తో మరో సినిమా.. డైరెక్టర్ విఐ ఆనంద్ తో ఓ ప్రాజెక్ట్.. మహేశ్ బాబుతో ఓ సినిమా.. సందీప్ వంగా మరియు 'కలర్ ఫొటో' డైరెక్టర్ తో ప్రాజెక్ట్స్.. అల్లు శిరీష్ తో రెండు సినిమాలు.. ఇలా చాలా ప్రాజెక్ట్ లు ఈ ప్రొడక్షన్ హౌస్ లో కమిట్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
కాగా, గీతా ఆర్ట్స్ ఆల్రెడీ నిర్మాణం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ లో అందరికీ దాదాపు 90 శాతం పేమెంట్స్ ఇప్పటికే ఇచ్చేశారట. కమిట్ అయిన సినిమాలకు సంబంధించిన వారందరికీ అడ్వాన్స్ లు కూడా ఇచ్చేశారట. అయితే లాక్ డౌన్ కారణంగా ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయాయి. అందులోనూ ఎక్కువ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుండటం వల్ల సినిమాలకు పెట్టిన బడ్జెట్ నిర్బంధం అయిపోయింది. అందులోనూ డిస్ట్రిబ్యూషన్ నుంచి రావాల్సిన డబ్బులు కూడా ఆగిపోవడంతో ప్రస్తుతం కమిటైన సినిమాలకు బడ్జెట్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అందుకే దీని నుంచి బయటపడటానికి ముందుగా చిన్న సినిమాలు కంప్లీట్ చేసి.. ఏదైనా ఓటీటీకి ఇవ్వాలని ఈ ప్రొడక్షన్ హౌస్ వారు ప్లాన్ చేసుకుంటున్నారట. అయితే టాలీవుడ్ లో కమిట్మెంట్ బ్రేక్ చేయని నిర్మాణ సంస్థగా పేరున్న గీతా ఆర్ట్స్.. కరోనా క్రైసిస్ లో కూడా ఒక్క ప్రాజెక్ట్స్ ఆపలేదు. ఇలాంటి సమయంలో కూడా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేస్తుండటం గొప్ప విషయమనే చెప్పొచ్చు.