Begin typing your search above and press return to search.

సంక్రాంతి వరకు నందమూరి వార్‌ తప్పదా?

By:  Tupaki Desk   |   2 Oct 2015 3:56 AM GMT
సంక్రాంతి వరకు నందమూరి వార్‌ తప్పదా?
X
ఇప్పటికే కోల్డ్‌ వార్‌ నడుస్తోందని ఊరంతా కోడై కూస్తోంది. అయినాసరే నందమూరి బాలయ్య - జూనియర్‌ ఎన్టీఆర్‌ లు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఇద్దరూ ఒకటే తేదీ నాడు తమ సినిమాలను తేవాలని డిసైడ్‌ అయిపోయారు. అందుకే జనవరి 8.. 2016ను తమ సినిమాలైన ''డిక్టేటర్‌'' ''నాన్నకు ప్రేమతో'' రిలీజ్‌ చేయడానికి టార్గెట్‌ గా ఫిక్సు చేసుకున్నారు. కాని ముందుగా జూనియర్‌ తేదీ ప్రకటించేశాడు కాబట్టి.. ఒకవేళ బాలయ్య 15న వస్తారేమో. అయితే ఆ తేదీల గోల అటుంచితే.. అసలు సినిమాలు రిలీజ్‌ అయ్యేవరకు ఫస్టు లుక్‌ నుండి ట్రైలర్‌ లాంచ్‌ వరకు అన్నీ ఒకటే రోజున చేస్తూ.. ఇద్దరూ అభిమానులను ఒకేసారి అలరిస్తున్నారా లేకపోతే ఏదైనా ఆన్‌ లైన్‌ వార్‌ లో పాల్గొంటున్నారు అనే విషయం మాత్రం అర్ధం కాకుండా చేస్తున్నారు.

మొన్ననే వినాయక చవితి సందర్భంగా ఓ విషయాన్ని క్లియర్‌ చేశారు నందమూరి హీరోలు. ఇద్దరూ ఒకేసారి టీజర్లను అందిస్తారని.. మొన్న గణేష్‌ షెస్టివల్‌ కు 'తొలిచూపు'ను అందిస్తే.. ఇపుడు మళ్లీ దసరాకు మరో ట్రీట్‌ ఫిక్సు చేశారట. ఆల్రెడీ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది కాబట్టి.. ఇప్పడు ఓ చిన్న వీడియో టీజర్‌ లాంచ్‌ చేయాలని అనుకుంటున్నారట. అక్టోబర్‌ 21 అర్ధరాత్రి డిక్టేటర్‌ టీజర్‌ రిలీజ్‌ చేయడానికి ఆల్రెడీ ఏర్పాటు జరిగిపోయాయ్‌. ఇక సరిగ్గా అదే రోజు నుండి ఎన్టీఆర్‌ కూడా నాన్నకు ప్రేమతో కొత్త షెడ్యూల్‌ స్పెయిన్‌ లో మొదలు పెట్టనున్నాడు. అక్కడికి వెళ్ళడానికి ఓ రోజు ముందు ఫ్యాన్స్‌ కు టీజర్‌ ఇచ్చేసి వెళతాడట. చూస్తుంటే రేపు దీపావళికి.. తరువాత క్రిస్మస్‌ కు.. న్యూ ఇయర్‌ కు.. ఇలా నందమూరి టీజర్ల వార్ తప్పేలా లేదే.